అఖిల్ సినిమాకి హాలీవుడ్ స్టంట్ మాస్టర్!!

0
609
hollywood stunt master kenny bates for akhil vikram k kumar movie

Posted [relativedate]

hollywood stunt master kenny bates for akhil vikram k kumar movie అక్కినేని వారసుడిగా అఖిల్ సినిమాతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు అఖిల్. అయితే ఈ సినిమా డిజాస్టర్ అవ్వడంతో రెండో సినిమా విషయంలో చాలా కేర్ తీసుకుంటున్నారట నాగార్జున, అఖిల్. మ‌నం సినిమాతో  తమ  కుటుంబానికి క్లాసిక్ అండ్ మెమొరబుల్  హిట్‌ అందించిన విక్ర‌మ్‌.కె.కుమార్‌ కి అఖిల్ రెండో సినిమా  దర్శకత్వ  బాధ్యతలను అప్పగించాడు నాగ్.  అలానే ఈ సినిమాకి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఏ.ఆర్‌.రెహ‌మాన్ ని  లైన్లో పెట్టేశాడు. దీంతో పాటు ప్ర‌ఖ్యాత హాలీవుడ్ యాక్ష‌న్ కొరియోగ్రాఫ‌ర్ కెన్నీ బేట్స్‌  రంగంలోకి దించేశాడట మన టాలీవుడ్ కింగ్.

వ‌ర‌ల్డ్‌ వైడ్ క్రేజీ సిరీస్‌ గా పేరు పొందిన `ట్రాన్స్‌ ఫార్మ‌ర్స్‌` సిరీస్‌కి యాక్ష‌న్ కొరియోగ్రాఫర్ గా పనిచేశాడు  బేట్స్‌. ప్ర‌భాస్‌- సుజిత్ కాంబినేష‌న్‌ లో తెరకెక్కుతున్న  తాజా సినిమాకి కూడా బేట్స్… యాక్షన్ సన్నివేశాలను అందిచనున్నాడని ఫిలింనగర్ వర్గాల టాక్. అఖిల్‌ ని యాక్ష‌న్ హీరోగా ఎలివేట్ చేసేందుకు కెన్నీ ఇప్ప‌టికే ప్రిప‌రేష‌న్ కూడా స్టార్ట్ చేశాడట‌. కెన్నీ ఇచ్చిన ఇంస్ట్రక్షన్స్ ప్రకారం అఖిల్ కూడా  జిమ్ముల్లో క‌స‌ర‌త్తులు మొద‌లెట్టేశాడ‌ని చెబుతున్నారు.  అలానే ఈ సినిమాలో నాగ్ బెస్ట్ ఫ్రెండ్ అయిన ట‌బు ఓ కీల‌క‌పాత్ర‌లో క‌నిపించ‌బోతోందని సమాచారం. మొత్తానికి అఖిల్ రెండో సినిమా మొదలుకాకముందే అంచనాలను పెంచేస్తోంది కదూ.

Leave a Reply