ఆ మంత్రికి పార్టీ నే కుటుంబమట …

Posted October 7, 2016

    home minister chinarajappa angry jagan botsa
టీడీపీ శిక్షణా తరగతుల సందర్భంలో హోమ్ మంత్రి చినరాజప్పని లోకేష్ కోప్పడినట్టు సోషల్ మీడియా లో జరుగుతున్న ప్రచారాన్ని,దానిపై వైసీపీ స్పందనకు కౌంటర్ వచ్చింది.స్వయంగా చిన్నరాజప్పే రంగంలోకి దిగి జగన్,బొత్సలను తూర్పారబట్టారు.లోకేష్ తనను ఏమీ అనలేదని, తనకు టీడీపీ కుటుంబమని అయన స్పష్టం చేశారు.కుంభకోణాల్లో ఇరుక్కున్న బొత్స కి భయపడే అవసరముందని ,తనకు ఆ అవసరం లేదని రాజప్ప చెప్పారు.వై.ఎస్ హయాంలో ఆ భయం తోనే జగన్ లక్షల కోట్లు దోచుకుంటున్న బొత్స నోరు మెదపలేదని రాజప్ప అన్నారు.జగన్ ముందు పిల్లిలా వుండే బొత్స ముందు తన సంగతి చూసుకోవాలని హోమ్ మంత్రి సలహా ఇచ్చారు.సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసే వాళ్లపై చర్యలు తప్పవని అయన హెచ్చరించారు.

SHARE