సముద్రంలో గుర్రపు స్వారీ..

0
672

davan jaddu
వెస్టిండీస్ పర్యటనలో టీమిండియా ఆటగాళ్లు తెగ ఎంజాయ్ చేస్తున్నారు. బీచ్ లు రిసార్టుల్లో రిలాక్స్ అవుతున్న క్రికెటర్లు ఎవరుకు నచ్చిన విధంగా వారు తెగ తిరిగేస్తున్నారు. మొన్న వాలీబాల్ తో మజా చేసిన మనోళ్లు.. ఆ తర్వాత సెయింట్ నెవిస్ బీచ్ లో ఈత కొట్టారు. ఓపెనర్ కే.ఎల్ రాహుల్ అయితే నడిసంద్రంలో దూకేసి సరదా తీర్చుకున్నాడు. ఇక మిగిలిన వాళ్ల సంగతి సరేసరి.

సెకండ్ ప్రాక్టీస్ మ్యాచ్ ముందుకు కూడా క్రికెటర్లు సరదాగా గడిపారు. ప్రస్తుతం సెయింట్ కీట్స్ లో ఉన్న టీమిండియా అక్కడి బీచ్ అందాలను ఆస్వాదిస్తుంది. మిగిలిన క్రికెటర్లంతా బీచ్ లో చక్కర్లు కొడుతుంటే. ఇద్దరు మాత్రం డిఫరెంట్ స్టైల్ ను ఎంచుకున్నారు. ఓపెనర్ శిఖర్ ధావన్, ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా గుర్రాలెక్కేశారు.

స్వతహాగా గుర్రాలంటే ఇష్టపడే రవీంద్ర జడేజా కొత్తవాటినైనా కంట్రోల్ లో పెట్టి స్వారీ చేయగా.. అతనికి శిఖర్ ధావన్ కూడా తోడయ్యాడు. ఇద్దరూ గుర్రపు స్వారీ చేయడమే కాదు. వాటిని సముంద్రంలోకి తీసుకెళ్లారు. నీటిలో దాదాపు మునిగే లోతు వరకు వాటిని తీసుకెళ్లారు. ఆ గుర్రాలు కూడా ఎలాంటి వ్యతిరేకత లేకుండా మనోళ్లు చెప్పినట్లు విన్నాయి.

వెస్టిండీస్ గుర్రాలపై తెగస్వారీ చేసేస్తున్న మన క్రికెటర్లు.. మరి కరీబియన్ బౌలర్లపై ఎలాంటి ఆధిపత్యం చూపిస్తారో చూడాలి.

Leave a Reply