మధ్యప్రదేశ్ లో సోషల్ మీడియా ఎంత పని చేసింది..?

0
400
How did social media work in Madhya Pradesh

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

దేశానికి వెన్నెముక రైతు . ఇది నిజం. కానీ పార్టీలకు మాత్రం ఈ సంగతి ఎన్నికల సమయంలోనే గుర్తొస్తుంది. మిగతా సమయాల్లో అసలు అన్నదాతలు అనే వారు ఉన్నారనే విషయం కూడా మర్చిపోయినట్లు వ్యవహారిస్తుంటారు. మధ్యప్రదేశ్ ప్రభుత్వం అలా నిర్లక్ష్యంగా వ్యవహరించి, ఐధుగురు రైతుల ప్రాణాలు తీసింది కాబట్టే.. అక్కడ ఉద్యమం ఎగసిపడిందనేది బయటకు కనిపించే నిజం.

కానీ అంత వేగంగా మధ్యప్రదేశ్ అంతా ఉద్యమం వ్యాపించడానికి ప్రధాన కారణం ఏంటో పోలీసులకూ తెలుసు. అయినా సరే బయటకు చెబితే పరువు పోతుందని నోరు కట్టేసుకున్నారు. అరబ్ వసంతం విజయవంతం కావడంలో కీలక పాత్ర పోషించిన సోషల్ మీడియా.. ఇప్పుడు మాందసౌర్ ఘటనలోనూ కీలక పాత్ర పోషించిందని తెలుస్తోంది.

మొదట ఆందోళనలకే పరిమితం కావాలనుకున్న రైతుల్ని పోలీసులు రెచ్చగొట్టి కాల్పులు జరపడంతో.. పరిస్థితి విషమించింది. చివరకు అనవసర వివాదాలు ఎక్కువై.. ఉద్యమం ఉధృతమైంది. చివరకు సీఎం దిగొచ్చి శాంతి దీక్ష చేసి, రుణమాఫీ లాంటి హామీలకు సిద్ధమేనని చెప్పాల్సి వచ్చింది. ప్రస్తుతానికి రైతులు ఆందోళన విరమించినా.. ప్రభుత్వం భవిష్యత్తులో తీసుకునే చర్యలే వారి ఫ్యూచర్ ప్లాన్ ను నిర్ణయిస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు.

Leave a Reply