కేసీఆర్ చెప్పినట్టే ..ఎన్టీఆర్ చేశాడు…

 how kcr said ntr doing like thatమొక్కలతోపాటు మనుషులను కూడా కాపాడితే ఇంకా అందంగా ఉంటుంది.. 213 చెట్లు.. ముంబైకి చాలా ఆక్సిజన్ సప్లయ్ చేస్తున్నాయి.. నేచర్ తో పెట్టుకుంటే తాటతీస్తా.. చెట్లంటే నాకు ఎంత ప్రాణం.. ఈ డైలాగ్స్ జనతాగ్యారేజ్ మూవీలోనివి. ఇంత కంటే ముందు చాలా సార్లు విన్నాం మనం. అదే సీఎం కేసీఆర్ నోటి వెంట. హరితహారం పేరుతో రాష్ట్రంలో ఉద్యమంలా చేపట్టిన మొక్కల పెంపకం అందరికీ తెలిసింది. మనిషిని బతికించే చెట్ల ప్రతి ఒక్కరూ పెంచాలని ప్రభుత్వం చేపట్టిన అద్బుత కార్యక్రమం. ఈ స్ఫూర్తి నుంచి వచ్చిందే జనతాగ్యారేజ్ సినిమానా..

ఇప్పుడు ఇదే చర్చ ప్రతిచోటా వినిపిస్తోంది. సీఎం కేసీఆర్ హరితహారం కాన్సెప్ట్ లోనే జనతాగ్యారేజ్ తెరకెక్కుతుందా అనే టాక్ నడుస్తోంది. కొరటాల శివ తెరకెక్కించే ప్రతి సినిమా ప్రభుత్వంలోని ఒక విధానాన్ని బేస్ చేసుకుని ఉంటుంది. ఫ్యాక్షన్ నిర్మూలించాలి.. ప్రేమను పంచాలని మిర్చి సినిమా ఉంటే.. మోడీ పిలుపునిచ్చిన దత్తత కాన్సెప్ట్ తో శ్రీమంతుడు ఉంది..

ఇప్పుడు జనతాగ్యారేజ్ చెట్లతో ప్రకృతి పచ్చదనాన్ని లింక్ చేసి చెబుతున్నాడు. ఓ కాన్సెప్ట్ కు కమర్షియల్ ఎలిమెంట్స్ ఇవ్వటంలో కొరటాలది డిఫరెంట్ స్లయిల్. ఈ క్రమంలోనే హీరోకు మొక్కలపై ప్రేమ ఉంటుంది. ప్రతి సందర్భంలోనూ మొక్కలతోపాటు నువ్వంటే ఇష్టం అంటూ చెబుతుంటాడు. జనతాగ్యారేజ్ చూస్తే.. కేసీఆర్ హరితహారం గుర్తుకు రావటం మాత్రం ఖాయం అంటోంది ఫిల్మ్ ఇండస్ట్రీ. చూడాలి రిలీజ్ తర్వాత సర్కార్ నుంచి ఎలాంటి కాంప్లిమెంట్స్ వస్తాయో..

SHARE