బాలయ్య అధికారం ఎన్నేళ్లు ?

0
518

balu1
బాలయ్య అధికారం ఎన్నేళ్లనేది తేలడం లేదు .హిందూపురం ఎమ్మెల్యేగా ఐదేళ్ళేగా అనుకుంటున్నారా ?అది నిజమే కానీ ..గౌతమీపుత్ర శాతకర్ణి లో ఆయన ఎన్నేళ్లు రాజ్యపాలన చేశాడన్నదానిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి .

గౌతమీపుత్ర శాతకర్ణి పాలించిన కాలం మీద చరిత్రకారులు వివిధ అభిప్రాయాలు వెలిబుచ్చారు .కొన్ని పురాణాలు ..మరికొన్ని నాణేలు ,ఇంకొన్ని శాసనాలు …ఇవీ ఆయన పాలన కాలాన్ని నిర్ధారించడానికి వున్న ఆధారాలు .ఆయన తల్లి గౌతమి వేయించిన శాసనాలు కూడా ఈ సందేహాల్ని తీర్చలేకపోయాయి .చరిత్రకారులు ఇస్తున్న వివరాల ప్రకారం క్రీస్తు పూర్వం ..86-110,103-127,106-130 ల మధ్య శాతకర్ణి పాలన కాలం ఉండొచ్చని తెలుస్తోంది .వీటిలో కూడా ఇద్దరు చరిత్రకారులు శాతకర్ణి 24 ఏళ్ళు మాత్రమే పాలన చేశారని కొందరు 34 ఏళ్ళని మరికొందరు వాదిస్తున్నారు .

ఇంతకీ తెలుగు ప్రజలకి అంతగా తెలియని తమ పూర్వీకుడు ,శాతవాహన రాజు గౌతమీపుత్రశాతకర్ణి గురించి క్రిష్ సినిమా తీయడం గొప్పే .ఆయన ఏ శాసనాన్ని ఫాలో అయ్యాడో ?బాలయ్య చేత ఎన్నేళ్లు రాజ్య పాలన చేయించాడో ?

Leave a Reply