నయీమ్ ఇన్నాళ్లెలా తప్పించుకున్నాడు ?

113

 how nayeem mising so many years
పుప్పాలగూడ-నెక్నంపూర్‌ అల్కా పూర్‌ టౌన్‌షిప్‌లో నాలుగేండ్లుగా నివాసం ఉంటున్నా పోలీసుల నిఘా వైఫల్యం కారణంగా మోస్ట్‌ వాంటెడ్‌ కిల్లర్‌ నయీమ్‌ దొరకలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఐపీఎస్‌ వ్యాస్‌ హత్యతోసహా అనేక మందిని పొట్టనపెట్టు కున్న నయీం గ్యాంగ్‌కు పుప్పాలగూడ- నెక్నాంపూర్‌ గ్రామాల పరిధిలోని అల్కా పూర్‌ టౌన్‌షిప్‌లో నివాసమేర్పాటు చేయించిన వ్యక్తుల్లో భయం మొదలయిన ట్లు తెలుస్తున్నది. ఐటీ కారిడార్‌ ప్రాంతంలోని పుప్పాలగూడ, మణికొంద, నెక్నాంపూర్‌, నార్సిం గి గ్రామాలు నేరగాళ్లకు అడ్డాగా మారడంతో స్థానికులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.

అల్కాపూర్‌ టౌన్‌షిప్‌లో కోటలాంటి నయీం బంగ్లాలో నోట్ల కట్టలు, దస్తావేజులు, బంగారు ఆభరణాలు, భారీగా దొరికిన ఆయుధాలను చూసి పోలీసు ఉన్నతాధికారులే నివ్వెరపోయారంటే నయీమ్‌ నేర సామ్రాజ్యం ఏమేర విస్తరించిందో తెలుస్తోంది. నయీమ్‌కు విలాస వంతమైన భవనం, కార్లను ఎవరు సమకూర్చా రనే విషయంలో పోలీసులు లోతుగా విచారణ జరిపితే అనేక మంది భూ కబ్జాదారుల పాత్ర బ యటపడే అవకాశం ఉండడంతో కొందరు ఆం దోళన చెందుతున్నట్లు విశ్వసనీయ సమాచా రం.

నయీం ఇంట్లో దొరికిన నోట్ల కట్టలను లెక్కించడానికి ఏకంగా క్యాష్‌ కౌంటింగ్‌ మిషన్‌ల ను తెప్పించారంటే పోగు పడిన నగదు స్థాయిని అర్థం చేసుకోవచ్చు. వందలాది చైన్‌ స్నాచింగ్‌లకు పాల్పడి విలాసవంతమైన జీవితం గడ ిపి, పోలీసుల ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన శివ సైతం నార్సింగిలోనే షెల్టర్‌ తీసుకోవడం చర్చ నీయాంశమైంది. మద్దెల చెరువు సూరి అనుచరుడు మంగలి కృష్ణ సైతం పుప్పాలగూడ, మణికొండ పంచవటీ కాలనీలలో రెండేండ్ల పాటు షెల్టర్‌ తీసుకున్నారనే ఆరోపణలు కూడా వినిపి స్తున్నాయి.

ప్రశాంత వాతావరణం కనిపించే పుప్పాల గూడ, నెక్నాంపూర్‌, నార్సింగి, మణికొండ తది తర గ్రామాలలో పోలీసుల నిఘా అంతంత మాత్రమే కావడంతో మోస్ట్‌వాంటెడ్‌ గ్యాంగ్‌ల కు అడ్డాగా మారిందనే ఆరోపణలు వినిపిస్తు న్నాయి. చీమ చిటుక్కుమంటే కనిపెట్టాలనే యోచనతో తెలంగాణ ప్రభుత్వం పోలీసులకు వాహనాలను, అత్యాధునిక పరికరాలను, సమ కూర్చినా స్థానిక పోలీసులు నయీమ్‌ను కనిపె ట్టడంలో విఫలమయ్యారో అర్థం కావడం లేదు. భూదందాలకు పాల్పడి భారీగా కూడబెట్టిన అ నేక మంది సహకారంతోనే నయీమ్‌ ఈ ప్రాం తాన్ని అడ్డాగా ఎంచుకున్నాడని అంటున్నారు.

100కి పైగా కేసులపు ఎదుర్కొంటున్న న యీం చేసిన అనేక దారుణ హత్యల్లో తాండూ రు ప్రాంతానికి చెందిన పట్లోళ్ల గోవర్దన్‌రెడ్డిది ఒకటి. రెవల్యూషనరీ పేట్రియాటిక్‌ టైగర్స్‌(ఆ ర్పీటీ) వ్యవస్థాపకుడు అయిన గోవర్ధన్‌రెడ్డి బతి కున్నపుడు ఈ ప్రాంతంలో హల్‌చల్‌ చేశారు.
జిల్లాలో రెడ్‌ అలర్ట్‌!

పొరుగు జిల్లాల్లో పలు నేరాలను ఎదుర్కొంటున్న నేరస్తులు హతం కావడంతో పోలీసులు జిల్లా అంతటా రెడ్‌ అలర్ట్‌ ప్రకటించారు. మ హబూబ్‌నగర్‌ జిల్లా షాద్‌నగర్‌లో నయీం ఎన్‌ కౌంటర్‌, మెదక్‌ జిల్లా జహీరాబాద్‌లో వహీద్‌ హత్యతో జిల్లాలో పోలీసులు అప్రమత్తమయ్యా రు. తాండూరు, పరిగి, వికారాబాద్‌, మోమిన్‌ పేట తదితర మండలాల్లో పోలీసులు వాహనా లను క్షుణ్ణంగా పరిశీలించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here