ప్రివిలేజ్ కమిటీ సభ్యులే ఆలా చేస్తే ..ఎలా ?

Posted December 23, 2016

how privilage committee members doఆంధ్రప్రదేశ్‌ శాసనసభలో సెప్టెంబర్‌ 8, 9, 10 తేదీల్లో చోటు చేసుకున్న సంఘటనలపై ఏర్పాటైన ప్రివిలేజెస్‌ కమిటీ తన విచారణను పూర్తయింది..విచారణ నివేదికని వచ్చే నెల మొదటి వారం లో స్పీకర్ కి అందజేస్తామని కమిటీ చైర్మన్ గొల్లపల్లి సూర్య రావు చెప్పారు .ఇదిలా ఉండగా తమ పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం గా వ్యవహరిస్తోందని ఆంధ్ర ప్రదేశ్ ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తున్న తమను పలు రకాల మాటలతో కించ పరచటం పట్ల వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేసారు.

తెలుగుదేశం వైఖరి ఇదేనా అని ప్రివిలేజ్ కమిటీ ముందు ప్రశ్నించారు. తెలుగుదేశం ఏం ఎల్ ఏ ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్‌ (కమిటీ సభ్యుడు) చేసిన వ్యాఖ్యలపై ఆయన అభ్యంతరం తెలిపారు. ‘‘కొందరు బందిపోట్లు ఒక గ్రామాన్ని దోపిడీ చేసిన తరువాత.. ఇలా ఎందుకు చేశారని ఎవరైనా ప్రశ్నిస్తే రాష్ట్ర ప్రజల మేలు కోసం దోపిడీ చేశాం అన్నట్లుగా ఉంది వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు తీరు అని అన్నారట శ్రవణ్.

మరో సభ్యుడు కురుగొండ్ల రామకృష్ణ.. చెవిరెడ్డి ని ‘‘మీరంతా తప్పు చేసి కమిటీ ముందుకు వస్తున్నారు’’ అని అన్నారు అని కమిటీ సభ్యులే మేము తప్పు చేశామనే నిర్ణయానికి వచ్చినపుడు ఇక నేనెందుకు వాదనలు వినిపించాలి. ఇక మేం ఏం చెప్పినా ప్రయోజనం ఏముంటుంది’’ అంటూ ఈ విచారణను తాను వాకౌట్‌ చేస్తున్నానని బయటకు వచ్చేసినట్టు చెప్పారు .. 

SHARE