హృతిక్ తో స్టార్ టీవీ భారీ డీల్ ..

0
507
hrithik roshan star networks

Posted [relativedate]

hrithik roshan star networks
స్టార్స్ కే కాదు… సినిమాలకూ స్టార్ డమ్ ఏర్పడుతోంది. స్టార్స్ తో తీసే మూవీకి మంచి హైప్ వచ్చి ఆటోమేటిక్ గా స్టార్ డమ్ వచ్చేస్తోంది, బిజినెస్ పరంగా పెద్ద డీల్స్ కూడా అవుతుంటాయి. ఇదివరకు కోట్లలో అయ్యే బిజినెస్ డీల్స్ ఇప్పుడు వందల కోట్లలో ఉంటున్నాయి. ఇంకా విశేషమేంటంటే…శాటిలైట్ రైట్స్ కూడా కోట్లకు చేరుకున్నాయి. బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ సినిమాలకు, ఓ టీవీ ఛానల్ కు అలాంటి డీల్ ఒకటి ఓకే అయింది.బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ లేటెస్ట్ గా ఓ బిజినెస్ రికార్డ్ క్రియేట్ చేశాడు. అదికూడా శాటిలైట్ రైట్స్ విషయంలో…ఈ ఒప్పందం విలువ ఏకంగా రూ 550 కోట్లు. స్టార్ నెట్ వర్క్ హృతిక్ రోషన్ తో ఈ భారీ మొత్తానికి ఒప్పందం కుదుర్చుకుంది.

ఈ డీల్ ప్రకారం హృతిక్ రోషన్ తను నటించబోయే ఆరు సినిమాల శాటిలైట్ హక్కుల్ని స్టార్ నెట్ వర్క్ కు ఇవ్వాలి. ఈ డీల్ కు హృతిక్ భాయ్ ఓకే అన్నాడు.ఈ ఒప్పందానికి సంబంధించి నియమ నిబంధనల్ని కూడా పూర్తి చేసినట్టు తెలుస్తోంది. ఇప్పటికి బాలీవుడ్ లో ఎన్నో పెద్ద పెద్ద వ్యాపార ఒప్పందాలు జరిగినా…ఇంత బిగ్ డీల్ బాలీవుడ్ హిస్టరీలోనే ఫస్ట్ టైం అంటున్నారు. బాలీవుడ్ లో ఖాన్ ట్రియో లెవెల్ లో హృతిక్ కు కూడా ఇమేజ్ ఉన్న సంగతి తెలిసిందే.

బ్యాంగ్ బ్యాంగ్, క్రిష్ 3, అగ్నిపథ్, జిందగీ న మిలేంగే దుబారా వంటి బాలీవుడ్ పిక్చర్స్ ఈమధ్య గ్రాండ్ గా సక్సెస్ అయ్యాయి. వాటి శాటిలైట్ రైట్స్ కూడా మంచి రేట్ కే అమ్ముడయ్యాయి. అది చూసి స్టార్ టీవీ ఛానల్ …హృతిక్ ఆరు సినిమాలకోసం ఇంత పెద్ద మొత్తంలో శాటిలైట్ హక్కులు తీసుకొంది. ఇలా ఉండగా…. హృతిక్ రోషన్ నటిస్తున్న మొహంజదారో పిక్చర్ త్వరలోనే రిలీజ్ కాబోతోంది.

Leave a Reply