జంటగా ఓడినా… తల్లిదండ్రులుగా గెలుస్తున్న హృతిక్-సుసాన్

0
551

hruthik family

పిల్లలకు మంచి తల్లితండ్రులుగా ఉండేందుకు తమ విడాకుల అంశం అడ్డంకి కాబోదని బాలీవుడ్ సూపర్‌స్టార్ హృతిక్ రోషన్.. ఆయన మాజీ భార్య సుసాన్ గతంలోనే స్పష్టం చేశారు. ఈ మాటను అక్షరాలా పాటిస్తూ తమ చిన్నారులు హ్రేహాన్, హ్రిదాన్‌లతో లండన్‌తో ఉల్లాసంగా గడుపుతున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలను బాలీవుడ్ నటి సోనాలిబింద్రే సోషల్‌మీడియాలో పోస్ట్ చేసింది.

సోనాలి బింద్రే, గాయత్రి జోషి లాంటి సన్నిహిత మిత్రులతో సుసాన్ సెలవులు ఎంజాయ్‌ చేసేందుకు లండన్ వెళ్లింది. తమతోపాటే పిల్లలనూ వెంటబెట్టుకెళ్లారు వారు. ఇలా లండన్‌లో హుషారుగా గడుపుతున్న చిత్రాలను సోనాలి, సుసాన్ పోటీపడి ఇన్‌స్ట్రాగ్రామ్‌లో షేర్ చేసుకున్నారు. సోనాలి పోస్ట్‌ చేసిన ఫొటోలో.. పిల్లల వెనక హృతిక్‌ ఉన్నారు. ప్రాణంగా చూసుకునే తనయుల కోసమే హృతిక్ లండన్ వెళ్లి.. సుసాన్‌ గ్యాంగ్‌తో కలిశారు.

లండన్-లో హృతిక్-సుసాన్ hritik 3 - Copy (1)

Leave a Reply