మూడు కెమెరాల క్లబ్‌లో హువాయి మేట్‌9ప్రో..

Posted November 15, 2016
Huawei Mate 9 Pro With Leica Dual Cameraజనానికున్న కెమెరాల క్రేజ్‌ని సొమ్ము చేసుకునే పనిలో మొబైల్‌ ఉత్పత్తి సంస్థలు క్యూ కడుతున్నాయి.. మూడు కెమెరాలున్న జాబితాలో తాజాగా హువాయి మేట్‌9ప్రో చోటు దక్కించుకుంది. వెనుక మోనోక్రోమ్‌ లెన్స్‌తో 20 మెగాఫిక్సెల్‌ కెమెరా, ఆర్‌జీబీ సెన్సార్‌ కలిగిన లైకా లెన్స్‌తో 12 మెగాఫిక్సెల్‌ కెమెరాతో ఈ కొత్త మోడల్‌ మార్కెట్‌ తలుపు తట్టింది. 4 జీబీ ర్యామ్‌తో 64 అంతర్గత మెమరీ, 6జీబీ ర్యామ్‌తో 128జీబీ అంతర్గత మెమరీతో వస్తుంది. బ్యాటరీ సైతం భారీగానే 4000 ఎంఏహెచ్‌ సామర్థ్యంతో విడుదల చేసింది. అలా్ట్ర హెచ్‌డీ క్వాలిటీతో 5.5 అంగుళాల కర్వ్‌డ్‌ స్ర్కీన్‌, ముందు సెల్ఫీకెమెరా 8 మెగాఫిక్సెల్‌తో విడుదల చేశారు. ఇందులో మరో ప్రత్యేకతేంటంటే ఆండ్రాయిడ్‌ కొత్త వర్షన్‌ నూగట్‌తోనే విడుదల చేయడం… దీనితోపాటు ప్రాసెసర్‌ 2.4గిగహెడ్జ్‌ అక్టాకోర్‌ రావడతో 3డీ గేమ్స్‌, మల్టీ టాస్కింగ్‌ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని సంస్థ పేర్కొంది. మరెందుకు ఆలస్యం ఓ లుక్‌ వేయండి మరి…
SHARE