పూరి మిగిల్చిన నష్టం..!

0
720
Huge Loss For Kalyan Ram Ism Movie

Posted [relativedate]

Huge Loss For Kalyan Ram Ism Movieటాలీవుడ్ డేరింగ్ డైరక్టర్స్ లో పూరి జగన్నాథ్ ఒకరని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన డైరక్షన్లో ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టిన సినిమాలు వచ్చాయి. అయితే రీసెంట్ గా పూరి కళ్యాణ్ రాం కాంబినేషన్లో వచ్చిన ఇజం ఫ్లాప్ అయ్యింది. ఆల్రెడీ ఫ్లాపుల్లో ఉన్న పూరికి ఈ సినిమా ఫ్లాప్ పెద్ద నష్టం వాటిల్లలేదు కాని ఎటుకూడి ఈ ఫ్లాప్ భారాన్ని మొత్తం కళ్యాణ్ రామ్ మోయాల్సి వస్తుంది. అలా ఎందుకు అంటే సినిమా నిర్మాత ఆయనే కాబట్టి.

కళ్యాణ్ రాం డిఫరెంట్ స్టైల్ తప్పించి ఈ సినిమాలో చెప్పుకునే విషయం ఏది లేదు. అయితే సినిమాకు 25 కోట్ల బడ్జెట్ పెడుతున్నప్పుడే పూరి అంచనాలను అందుకుంటాడా అన్న డౌట్ వచ్చింది. అయితే పూరి మీద నమ్మకంతో అంతా పెట్టేశాడు నందమూరి హీరో. తీరా సినిమా రిజల్ట్ చూసి షాక్ అయ్యాడు ఇప్పుడు ఆ సినిమా టోటల్ బిజినెస్ చూసి తల పట్టుకున్నాడట కళ్యాణ్ రామ్. సినిమా బడ్జెట్ మొత్తం 25 కోట్లు కాగా కలక్షన్స్ పరంగా 12.5 కోట్లు శాటిలైట్ రైట్స్ అన్ని కలిపి 15 కోట్ల దాకా వచ్చాయట. సో ఈ లెక్కన ఇజం వల్ల కళ్యాణ్ రామ్ 10 కోట్లు నష్టపోయాడన్నమాట.

స్టార్ డైరక్టర్ తో సినిమా తీసి ఈసారి ఎలాగైనా ఓ సూపర్ హీరో ఇమేజ్ సంపాదించాలనుకున్న కళ్యాణ్ రామ్ ఇప్పుడు ఈ లాస్ ను ఎలా కవర్ చేసుకోవాలా అని చూస్తున్నాడట. పూరి ఇజం హిట్ అయితే తన బ్యానర్లో తమ్ముడు తారక్ తో మరో సినిమా చేసే ఊపు చేసినా రిజల్ట్ చూసి ఏం తోచని పరిస్థితుల్లో ఉన్నాడట. అఫ్కోర్స్ సినిమా అన్నాక హిట్లు ఫ్లాపులు కామనే అనుకోండి కాని తన రేంజ్ కన్నా ఎక్కువ బడ్జెట్ పెట్టి ఇప్పుడు బాధపడుతున్నాడు కళ్యాణ్ రామ్.

Leave a Reply