మనిషీ… ఓ మనిషీ!!

Posted [relativedate]

human nature is diferentచేతిలో డబ్బు లేకపోతే ఇంట్లో ఉన్న కూరగాయలు తినేసి ఊరుకుంటావ్
జేబునిండా డబ్బు ఉంటే స్టార్ హోటల్‌కు వెళ్లి అవే కూరగాయలు తిని ఆనందిస్తావ్

డబ్బు లేని రోజున ….
సైకిల్ మీద ఆఫీసుకు వెళతావ్…
డబ్బులు ఎక్కువైతే అదే సైకిల్
ఇంట్లోనే ఎక్కి ఎక్కర్‌సైజ్‌లు చేస్తావ్…!

డబ్బులు లేనప్పుడు సంపాదన కోసం చెప్పులు అరిగేలా నడుస్తావ్…
డబ్బు ఎక్కువైతే పెరిగిన కొవ్వు కరిగించుకొనేందుకు నడుస్తావ్…!

మనిషీ … ఓ మనిషీ!!
ఇలా నిన్ను నీవు మోసం చేసుకొనేందుకు ….
ఏ రోజునా వెనకడుగు వేయవ్!

డబ్బు లేనప్పుడు కుదురుకొనేందుకు పెళ్లి చేసుకోవాలనుకుంటావ్
డబ్బు ఎక్కువయినప్పుడు విడాకులు కావాలనుకుంటావ్ …!

డబ్బు లేనప్పుడు ….
నీ భార్య నీ సెక్రటరీ అవుతుంది….
డబ్బు ఎక్కువైతే ….
నీ సెక్రటరీయే భార్య అవుతుంది….!

డబ్బు లేనప్పడు ….
సంపన్నుడిలా నటిస్తావు…
డబ్బు ఉన్నప్పడు ….
నిరుపేదలా నటిస్తావు…!

మనిషీ… ఓ మనిషీ!!
జీవితంలో ఎన్నడూ ….
సత్యానికి దగ్గరగా ఉండవ్…!

షేర్ మార్కెట్..
అంతా మోసం అని అరుస్తావ్… అయినా స్పెక్యులేషన్ మానవ్..
డబ్బు మహా చెడ్డది అంటావ్..
అయినా ….
సంపదను పోగుచేయడం మానవ్…
పదవులు వస్తే అందరికీ దూరం అయిపోతాం అని లెక్చరిస్తావ్ ….
అయినా పదవుల వెంటపడతావ్…!

మనిషీ… ఓ మనిషీ!! నువ్వో చిత్రం!
నీవు అనుకున్నది చేయవు..
చేసేది చెప్పవు…
మనిషీ… ఓ మనిషీ!!
నువ్వో మహా విచిత్రం!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here