పాక్ క్రికెట్ పై హైద‌రాబాదీల మోజు!!

Posted [relativedate]

hyderabad peoples support to pakistan cricket players
పాకిస్తాన్ క్రికెట‌ర్లకు హైద‌రాబాద్ లో విపరీత‌మైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కార‌ణ‌మేంటో తెలియ‌దు కానీ పాక్ క్రికెట్ ను మ‌నోళ్లు తెగ ఫాలో అయిపోతున్నారు. ముఖ్యంగా ప్ర‌స్తుతం దుబాయ్ లో జ‌రుగుతున్న పాకిస్తాన్ సూప‌ర్ లీగ్ ను హైద‌రాబాదీలు ఎగ‌బ‌డి చూసేస్తున్నారు. ఆ క్రేజ్ మామూలుగా లేదు. మ‌న ఐపీఎల్ రేంజ్ లో ఉంది.

ట్విట్ట‌ర్ హైద‌రాబాద్ ట్రెండింగ్ లో పాకిస్తాన్ సూప‌ర్ లీగ్ (పీఎస్ఎల్-2017) కు క్రేజ్ విప‌రీతంగా ఉంది. ట్విట్ట‌ర్ లో ఎగ‌బ‌డి చూస్తున్నారు. హైద‌రాబాద్ ట్రెండింగ్ లో పీఎస్ఎల్ టాప్ లో ఉంది. కుర్రాళ్లు ఎప్ప‌టిక‌ప్పుడు స్కోర్ల‌ను అప్ డేట్ చేస్తున్నారు. క్రికెట‌ర్ల‌కు బెస్ట్ విషెస్ తెలియ‌జేస్తున్నారు.

ప్ర‌స్తుతం ఇండియాలో క్రికెట్ సీజ‌న్ లేదు. ఎందుకంటే ఇంకా ఐపీఎల్ రాలేదు. ఇండియా-ఆస్ట్రేలియా మ‌ధ్య టెస్టు సిరీస్ ఉన్నా.. యూత్ కు టెస్టుల‌పై అంత‌గా ఇంట్రెస్ట్ ఉండదు. పొట్టి క్రికెట్ అంటేనే యూత్ కు ఇష్టం కాబ‌ట్టి.. ప్ర‌స్తుతం పీఎస్ఎల్ వైపు వారంతా ఆక‌ర్షితులవుతున్నార‌న్న వాద‌న వినిపిస్తోంది. కార‌ణాలేవైనా పాకిస్తాన్ క్రికెట‌ర్ల‌కు హైద‌రాబాద్ లో ఫ్యాన్స్ పెరుగుతున్నారంటే ఆశ్చ‌ర్యంగానే ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here