హైప‌ర్ మూవీ ప్రివ్యూ …

Posted September 29, 2016

 hyper movie preview

చిత్రం : హైప‌ర్
న‌టీన‌టులు : రామ్‌, రాశీఖ‌న్నా
సంగీతం : జిబ్రాన్‌
దర్శకత్వం : సంతోష్ శ్రీనివాస్‌
నిర్మాత‌లు : రామ్ ఆచంట‌, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంక‌ర‌
రిలీజ్ డేట్‌ : 30 సెప్టెంబ‌ర్‌, 2016.

“అపజయం చెబుతోంది.. విజయం విలువెంత ? అన్నది”. విజయం ఇచ్చే కిక్కు యంగ్ హీరో రామ్ కి బాగా తెలుసు. చాన్నాళ్ల తర్వాత ‘నేను శైలజ’ సినిమాతో హిట్ కిక్కుని ఎంజాయ్ చేశాడు రామ్. ఇకపై కూడా హిట్ ట్రాక్ లో పయనించాలని డిసైడ్ అయ్యాడు. అందుకు తగ్గట్టుగానె ప్లాన్ చేసుకొన్నాడు. ‘నేను శైలజ’ తర్వాత ఆచితూచి ‘కందిరీగ’తో హిట్టిచ్చిన సంతోష్ శ్రీనివాస్ కి ఓకే చెప్పాడు. వీరి కలయికలో తెరకెక్కిన చిత్రం “హైపర్”. దసరా కానుకగా రేపు
(సెప్టెంబర్ 30) ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈలోపు..  ‘హైపర్’ హైలైట్స్ పై ఓ లుక్కేద్దాం పదండీ..

“హైపర్”.. ‘ప్ర‌తి ఇంట్లో ఒక‌డుంటాడు’ అన్నది ట్యాగ్ లైన్. తండ్రిని గెలిపించే కొడుకు క‌థే ‘హైప‌ర్‌’. తండ్రి సెంటిమెంట్ ఏ రేంజ్ లో ఉంది.. రామ్ హై ‘పవర్’ ఇప్పటికే రిలీజైన టీజర్, ట్రైలర్స్ ని చూస్తే అర్థమవుతోంది. రామ్ తండ్రిగా సత్యరాజ్ (కట్టప్ప) కనిపించనున్నాడు. తండ్రికొడుకల మధ్య వచ్చే ఫన్నీ సన్నివేశాలని మాత్రమే ట్రైలర్ లో చూశాం.. వీరి మధ్య గుండెని పిండేసే సెంటిమెంట్ సీన్స్ కూడా సినిమాలో ఉన్నాయట. ‘నేను శైలజ’లో బ్యాలెన్సెడ్ గా కనిపించిన రామ్.. ‘హైపర్’లో మరోసారి తన ఎనర్జిని బయటితీసుకొచ్చాడట. రెడ్ బుల్ తాగిన పులిలాగా ఎనర్జిటిక్ గా కనిపించబోతున్నాడు. ఇక, రామ్ సరసరన జతకట్టిన రాశీఖన్నా.. ట్రైలర్ లోనే హీటెక్కించింది. అందాల ట్రైలర్ చూపించేసింది. ఇక మొత్తం సినిమాలో ఇంకెన్ని అందాలు చూపిస్తుందోనని ఆశగా ఎదురు చూస్తున్నారు ప్రేక్షకులు.

కథేంటీ ?.. చిత్రబృందం కథనాల ప్రకారం : ప్రతి కొడుకుకి తండ్రే హీరో. ఇది యూనివర్సల్ ట్రూత్. ఇదే లైన్ తో హైపర్ కథని రాసుకొన్నాడు సంతోష్ శ్రీనివాస్. తండ్రిని గెలిపించే కొడుకు క‌థే “హైప‌ర్‌”. హీరో రామ్ కి చిన్న‌ప్ప‌టి నుంచి తండ్రి (సత్యరాజ్) అంటే అమితమైన ప్రేమ. అప్పుడప్పుడు అది అతిగా కూడా అనిపిస్తుంటుంది. అంతగా ప్రేమించే తండ్రి ఓ సమస్యలో ఇరుక్కుంటే..  కొడుకుగా రామ్ ఏం చేశాడు ? సినిమాలో హీరోయిన్ రాశీఖ‌న్నా ఎవరు ?? ఆమె ప్రేమని ఎలా దక్కించుకొన్నాడు.. ?? అన్నది హైపర్ కథ.

అయితే, ఈ ఫాదర్ సెంటిమెంట్ ని తనదైన శైలిలో తెరకెకించాడట దర్శకుడు సంతోష్ శ్రీనివాస్. తొలిభాగం అంతా.. కామెడీ, రొమాన్స్ తో నింపేసి.. సెకాండాఫ్ లో తండ్రి ప్రేమ తాలుకు ఎమోషన్స్ ప్రేక్షకుల గుండెకు తాకెట్టు తీర్చిదిద్దాడట.

రిలీజ్ కు ముందే “హైపర్” హై రేంజ్ లో పెరిగిపోయాయ్.  రామ్ ఖాతాలో ‘కందిరీగ’లాంటి హిట్ పడటం ఖాయంటున్నారు. ఈ సినిమాపై మరో ప్రచారం కూడా
సాగుతోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు ‘దూకుడు’ లక్షణాలు హైపర్ లో ఉన్నాయట. ‘దూకుడు’ కూడా 14రీల్స్ పతాకంపైనే తెరకెక్కింది. దూకుడు లో మహేష్ పండించిన ఫాదర్ సెంటిమెంట్.. బాక్సాఫీస్ ని షేక్ చేసింది. ఇప్పుడు హైపర్ కూడా ఫాదర్ సెంటిమెంట్ తో రానుండటంతో నిర్మాతలు దూకుడు రిజల్ట్ ని ఎక్స్ పెక్ట్ చేస్తున్నట్టు కనబడుతోంది. కందిరీగ, దూకుడు.. ఈ రెండు చిత్రాల్లో ఏ చిత్రం రిజల్ట్ రిపీట్ అయినా హైపర్ నిర్మాతల పంటపండినట్టే.

మొత్తానికి.. అన్ని హంగులతో ‘హైపర్’ ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు రెడీ అయ్యింది. ఇక, ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకొన్నారనేది మరికొన్ని గంటల్లో  తేలనుంది.  ఈ చిత్రం లైవ్ అప్ డేట్స్, పూర్తి రివ్యూ కోసం క్లిక్ చేస్తూనే ఉండండి.. మీ తెలుగు బుల్లెట్ డాట్ కామ్.

SHARE