ఆ ఛాన్స్ వస్తే ఎగిరిగంతెస్తా..!

Posted November 6, 2016

kj1616సౌత్ సూపర్ హీరోయిన్స్ లో కాజల్ అగర్వాల్ ఒకరని తెలిసిందే. కోలీవుడ్ టాలీవుడ్ అనే తేడా లేకుండా రెండు చోట్ల ఓకే రేంజ్ క్రేజ్ సంపాదించిన భామ ఈ మధ్య కెరియర్ ముగించినట్టు కనిపించినా సడెన్ గా స్టార్స్ సినిమాలతో ఊపందుకుంది. ప్రస్తుతం మెగాస్టార్ మూవీలో ఛాన్స్ దక్కించుకున్న కాజల్ అవకాశం వస్తే బాహుబలి-3 లో నటించేందుకు తాను సిద్ధమే అని అంటుంది. రాజమౌళి మగధీరలో మిత్రవిందగా నటించి మెప్పించిన కాజల్ బాహుబలిలో తాను భాగం కానందుకు బాధగా లేదని రాజమౌళికి తన కాస్టింగ్ విషయంలో క్లారిటీగా ఉంటారని అన్నది.

బాహుబలి సినిమా తెలుగు సినిమా స్థాయిని మరింత పెంచిందని.. ఛాన్స్ వస్తే బాహుబలి–3 లో తప్పక నటిస్తా అంటుంది కాజల్. బాహుబలి మీద తన అభిప్రాయాన్ని చెబుతూనే తనకు అవకాశం ఇవ్వమని జక్కన్నకు అప్లికేషన్ పెట్టేస్తుంది ఈ చందమామ. అయితే ఇంకా పార్ట్ -2 రిలీజే కాలేదు అప్పుడే బాహుబలి-3 గురించి ఆలోచిస్తున్న కాజల్ ఆశలను చూసి అందరు నవ్వుకుంటున్నారు. ఆ సినిమా సెట్స్ మీదకు వెళ్లినప్పటి పరిస్థితిని బట్టి హీరోయిన్స్ సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉంది.

SHARE