మహేష్ ఇష్టం పవన్ కాదు

Posted November 4, 2016

sum1416అక్కినేని ఫ్యామిలీ నుండి హీరోగా హిట్ కోసం నానా కష్టాలు పడుతున్నాడు సుమంత్. సత్యం, గౌరి అంటూ నోటి లెక్కలేసుకునే హిట్లు కొట్టిన సుమంత్ ఇప్పుడు బాలీవుడ్ విక్కి డోనార్ రీమేక్ తో నరుడా డోనరుడా అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సినిమా టాక్ అటు ఇటుగా ఉన్నా సినిమాలో సుమంత్ కాస్త పర్వాలేదని అంటున్నారు. సినిమా ప్రమోషన్స్ లో దగ్గరుండి పాల్గొన్న సుమంత్ ఫ్యాన్స్ తో చిట్ చాట్ కూడా చేశాడు.

సోషల్ మీడియాలో అక్కినేని ఫ్యాన్స్ తో పాటుగా మిగతా ఫ్యాన్స్ అందరితో చాట్ చేసిన సుమంత్ మహేష్, పవన్ లలో ఎవరు ఇష్టం అన్న ప్రశ్న ఎదురైంది. సుమంత్ ఏమాత్రం తడుము కోకుండా మహేష్ అనేశాడు. మహేష్ సుమంత్ మంచి స్నేహితులు. అందుకే మహేష్ అంటే ఇష్టమని ఇప్పుడే కాదు ఎన్నో సార్లు చెప్పాడు. అయితే పవన్ ఫ్యాన్స్ హర్ట్ అవ్వకుండా సారీ పవన్ ఫ్యాన్స్ అని వారిని కూల్ చేశాడు లేండి. సో అలా మహేష్ మీద తనకున్న అభిమానం తెలిపాడు సుమంత్.

SHARE