ప్రజల కోసమే ప్రాణాలైనా ఇస్తా..ప్రధాని మోడీ

pm modi in goa air port lay foundation stoneవ్యతిరేక శక్తులు నన్ను బతకనీయకపోవచ్చు. ఏడు దశాబ్దాలుగా వారు లూటీ చేసిన సొమ్ము చిక్కుల్లో పడటంతో వారు నన్ను నాశనం చేయవచ్చు. అందుకు నేను సిద్ధంగానే ఉన్నాను’ అని ప్రధాని తీవ్రస్వరంతో అన్నారు.గోవాలోని మోపాలో గ్రీన్‌పీల్డ్ విమానాశ్రయానికి శంకుస్థాపన చేసిన అనంతరం మోదీ మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. 70 ఏళ్లుగా పేరుకుపోయిన అవినీతి జాడ్యాన్ని తాము 17 నెలల్లో పెకిలించేందుకు ప్రయత్నం చేసానని ఈ ప్రయత్నం లో తాన్ అప్రాణాలను సైతం ఇచ్చేందుకు వెనుకాడనని అన్నారు.

అత్యున్నత పదవిలో కూర్చోడానికి నేను పుట్టలేదు. నాకంటూ ఉన్న నా కుటుంబం, నా ఇళ్లు ఇవన్నీ దేశం కోసం వదిలి పెట్టేశాను, అవినీతి అంతానికి గత ప్రభుత్వాల చేసినదేమీ లేదు ,రాజకీయాలు చేయాలనుకున్న వారు చేసుకోవచ్చు అంటూ విమర్శకులపై ఆయన ఎదురుదాడికి దిగారు అవినీతి అంతానికి నేనిచ్చిన హామీకి కట్టుబడి ఉన్నాను’ పేద ప్రజల ఉద్దరణే తన ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.

 

SHARE