ఆదిలోనే ఆమ్యామ్యా..

0
549

ias officer jithendra bihar
బీహార్… గూండారాజ్‌కు కేరాఫ్ అడ్రెస్. అంతేనా అవినీతి అధికారులకు ఆ రాష్ట్రం కేరాఫ్ అడ్రెస్. అందు కేనేమో ఉజ్వల భవిష్యత్తు ఉన్న ఓ యువ ఐఏఎస్ అధికారి తన ఫస్ట్ పోస్టింగ్‌లోనే లంచావతారం ఎత్తాడు. ఆనక అడ్డంగా బుక్కయ్యాడు కూడా. వివరాల్లోకి వెళితే, బీహార కు చెందిన యువకుడు జితేంద్ర గుప్తా 2013లో విడుద లైన సివిల్ సర్వీసెస్ ఫలితాల్లో మంచి ర్యాంకు సాధించి ఐఏఎస్ సర్వీస్‌కు ఎంపికయ్యాడు. కఠోర శిక్షణ ముగిం చుకున్న అతడు బీహార్ కేడర్‌నే ఎంపిక చేసుకున్నాడు. ఈ క్రమంలో అతడిని బీహార్ సర్కారు మొహానియా, కైమూర్ సబ్ డివిజనల్ అధికారిగా నియమించింది.

విధుల్లో చేరిన అయ్యగారి చేతులు మాత్రం ఖాళీగా ఉండేందుకు ససేమి రా అన్నాయి. మంగళవారం ర్రాతి రోడ్డెక్కిన ఆయన అటు గా వెళుతున్న నాలుగు లారీలను ఆపేశాడు. వాటిలో రెం డు లారీలు ఓవర్‌లోడుతో వెళుతున్నట్లు గుర్తించాడు. నడిరోడ్డుపైనే బేరసారాలకు దిగిన గుప్తా రూ.1.5 లక్షలు ఇస్తే కానీ లారీలను వదిలేది లేదని వాహనాల యజమానికి తేల్చి చెప్పాడు. ఆ తరువాత జరిగిన బేరసారాల్లో రూ. 1.5 లక్షల నుంచి అతడు రూ. 80 వేలకు తగ్గాడు. అందు కు ఒప్పుకున్న లారీ ఓనర్… గుప్తాకు సొమ్ము ముట్టజె ప్పాడు.

సొమ్ముతో పాటు లారీల పత్రాలు తీసుకుని గుప్తా అక్కడి నుంచి ఇంటికి వెళ్లిపోయాడు. డబ్బుతో పాటు లారీ పత్రాలను తన అధికారిక నివాసంలోనే భద్రంగా దాచుకుని నిద్రకు ఉపక్రమించాడు. ఇక డబ్బు లంచా వతారం బారిన పడ్డ లారీ ఓనర్ ఆ తరువాత బీహార్ విజిలె న్స్ శాఖకు ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన విజిలెన్స్ అధికారులు గుప్తా నిద్రలో ఉండగానే ఆయన తలుపు తట్టారు. ఒళ్లు విరుచుకుని తలుపు తెరిచిన గుప్తా విజిలెన్స్ అధికారులను చూసి షాక్ తిన్నాడు. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. గుప్తాను తోసుకుంటూ లోపలికి వెళ్లిన విజిలెన్స్ అధికారులు లారీ ఓనర్ ఇచ్చిన డబ్బుతో పాటు లారీల పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. వెంటనే గుప్తాను అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు.

Leave a Reply