జియో దెబ్బకు ఐడియా కి చుక్కలు..

0
636
ideacellular-poi-reliance-jio

Posted [relativedate]

Image result for idea and jioరిలయన్స్ జియో దెబ్బకు ఐడియా కి చుక్కలు కనిపించాయి.జియో కారణం గా ఐడియా సెల్యూలర్ సంస్థ తో పాటు మిగతా సెల్ కంపెనీ లు నష్టాలను మూట కట్టుకుంటున్నారు. మలేషియన్ టెలికాం కంపెనీ ఆక్సియాటా తన వాటాను విక్ర‌యించాల‌ని ఐడియా సంస్థ భావిస్తోంది. జియో అప‌రిమిత ఉచిత‌ కాల్స్‌, త‌క్కువ‌ ధ‌ర‌కే డేటా స‌ర్వీసు కార‌ణంగా వినియోగ‌దారులు జియో వైపు మ‌ళ్లుతుండ‌డంతో ఐడియా మ‌రో మూడేళ్ల పాటు కోలుకోలేద‌ని భావిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఐడియా సంస్థలో తన 20 శాతం వాటాను (2 బిలియన్ల డాలర్ల విలువ) అమ్మేందుకు ప్రయత్నాలు చేస్తోందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి .

ఆదిత్యా బిర్లా గ్రూపుకి ఐడియాలో 40 శాతం వాటా ఉండ‌డంతో టెలికాం మలేషియా, ఆక్సియాటా వాటాను తిరిగి కొనుగోలు చేసుకోవాల‌ని ఐడియా కోరింది. ఇందుకు ఆదిత్య బిర్లా గ్రూప్ ఒప్పుకోక‌పోవ‌డంతో ఇతర కొనుగోలుదారుల కోసం ఐడియా ఎదురుచూస్తోంది. ఈ ఊహాగానాలపై మాత్రం ఐడియా, ఆక్సియాటా సంస్థలు స్పందించ‌కుండా మౌనం పాటిస్తున్నాయి.

న‌వంబ‌రు 9 నుంచి రూ. 100- 200 మధ్య రిచార్జ్ లు చేసుకునే వారి వినియోగ‌దారుల సంఖ్య విప‌రీతంగా ప‌డిపోయింద‌ని విశ్లేషకులు అంటున్నారు. ఇప్పటికే ఐడియా ఆదాయం పడి పోయింది , భవిష్యత్తు లో మరింత పడిపోవటం మాత్రమే కాకుండా ఆక్సియాటా వాటా విక్రయిస్తే ఆ సంస్థ‌కు మరిన్ని ఇబ్బందులు తప్పవని అభిప్రాయం వ్యక్తం అవుతోంది . మలేషియన్ టెలికాం కంపెనీ ఆక్సియాటాకు తన వాటాను విక్ర‌యించాల‌ని ఐడియా భావిస్తోంద‌ని వ‌స్తున్న వార్త‌ల‌తో మార్కెట్ లో ఐడియా కౌంటర్ క్షీణించింది. దాదాపు 3.28 శాతం నష్టాలతో ఉంది.

Leave a Reply