సామాన్యుడితో ధరలు దాగుడుమూతలు ఆడేస్తున్నాయి .నిన్న మొన్నటి దాకా మినప్పప్పు ,కందిపప్పు ధరలు ఆకాశాన్ని అంటాయి …ప్రభుత్వాలు కళ్ళు తెరిచి తీసుకున్న చర్యలు ఇప్పుడిప్పుడే జనానికి చేరుతున్నాయి ..ఆ రెండు పప్పులు ధరలు తగ్గుతున్నాయిలే ఇక ఇడ్లీలు ఇరగదీద్దాం అనుకునే లోపు చట్నీ తంటా వచ్చిపడింది .రైతుల దగ్గరనుంచి శనగలు వ్యాపారుల చేతుల్లోకి రాగానే సీన్ మారిపోయింది .
శనగల ధరలు ఒక్కసారిగా ఆకాశాన్ని అంటాయి .క్వింటాలు ధర 9 వేలకుపైగా పలుకుతోంది .ఇక చెప్పేదేముంది మార్కెట్ లో సన్నగా పప్పు రివ్వుమంటూ దూసుకెళ్తోంది .ఎప్పటిలానే సామాన్యుడు ఉసూరంటుంన్నాడు .ఇడ్లీ అందుబాటు లోకి రాగానే చట్నీ ఝలక్ ఇచ్చింది అనుకుంటూ గొణుక్కుంటున్నాడు .అరిస్తేనే ప్రభుత్వాలకు వినపడవు ..ఇక గొణిగి లాభం లేదు ..
*కిరణ్ కుమార్