Posted [relativedate]
జయలలిత అకాల మరణం తర్వాత తమిళనాడు రాజకీయ ముఖచిత్రమే మారిపోయింది. ప్రస్తుతానికి పన్నీర్ సెల్వం ప్రభుత్వానికి మంచి మెజార్టీయే ఉంది. కానీ ఇదే అదనుగా ఎవరైనా ఎమ్మెల్యేలు షాకిస్తే మాత్రం రాత్రికి రాత్రే ఏమైనా జరిగిపోవచ్చు.
తమిళనాడు అసెంబ్లీలో పార్టీల వారీగా బలాలను చూస్తే… మొత్తం 234 సీట్లలో అన్నాడీఎంకేకు 136 స్థానాలున్నాయి. అటు ప్రధాన ప్రతిపక్షం డీఎంకేకు 98 మంది ఎమ్మెల్యేలున్నారు. మ్యాజిక్ ఫిగర్ కు ఎలాంటి ఢోకా లేకపోయినప్పటికీ .. గవర్నమెంటుకు, అపోజిషన్ కు మధ్య తేడా దాదాపు 40 సీట్లు మాత్రమే. అంటే ఒక 20 మంది ఎమ్మెల్యేలు డీఎంకేకు జంప్ అయిపోయితే అంతే సంగతులు.
ప్రభుత్వానికి మెజార్టీ ఉన్నప్పటికీ.. ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షం డీఎంకే యాక్టివ్ అయ్యే అవకాశముంది. ఎందుకంటే ఇప్పుడు జయలేరు. ఇదే అదనుగా అన్నాడీఎంకే ఎమ్మెల్యేలకు ఎర వేస్తారని ప్రచారం జరుగుతోంది. బంపర్ ఆఫర్లు కూడా ఇచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. 20 మంది ఎమ్మెల్యేలు అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు పార్టీ మారాలని గట్టిగా డిసైడ్ అయితే ప్రభుత్వం కూలిపోతుంది. ఇప్పటికప్పుడు ఇది సాధ్యం కాకపోవచ్చు కానీ.. ఫ్యూచర్ లో మాత్రం అలా జరగదని మాత్రం చెప్పలేం.