కోడలు కూతురు అయితే ఇల్లే స్వర్గం…

Posted January 31, 2017

if daughter in law kept as daughter then home is heavenటాలీవుడ్ ప్రేమపావురాలుగా పేరు తెచ్చుకున్న సమంత, నాగచైతన్య నిశ్చితార్ధం వేడుక నిన్న అట్టహాసంగా జరిగిన సంగతి తెలిసిందే. నాగార్జున ఈ వేడుకను ఎంతో అట్టహాసంగా జరిపించాడు. తన తల్లే తనకు కూతురైందని నాగ్ ఆనంద పారవశ్యంతో  ట్వీట్ కూడా చేశాడు. నిజానికి చెప్పాలంటే సమంత ఓ క్రిస్టియన్ కుటుంబానికి చెందిన వ్యక్తి. టాలీవుడ్ టాప్ హీరోలుగా వెలుగుతున్న అక్కినేని వారసులు హిందువులు. అయినా కాబోయే తన కోడలు గతంలో మనం సినిమాలో తన తల్లిగా నటించడంతో  అప్పట్నుంచి సమ్మును  తన తల్లిగానే భావిస్తున్నాడట నాగ్. కేవలం రీల్ లైఫ్ లో కొంత ఎపిసోడ్ వరకే తల్లిగా యాక్ట్ చేసినా.. ఆ మధురానుభూతిని మన కింగ్ తన రియల్ లైఫ్ లోకి ఆపాదించాడు. వేరే కులానికి చెందిన వ్యక్తైనా, తన కొడుకు ఇష్టపడ్డ పిల్ల కావడంతో సమ్ముని మనస్ఫూర్తిగా తన కుటుంబంలోకి  ఆహ్వానించాడు నాగ్. ఇకనుండి నా బాధ్యత నీదే  అమ్మ… అని నాగ్ ఈ ట్వీట్ ద్వారా చెప్పకనే చెప్పాడు. నిజానికి సమంతని అమ్మగా కాకుండా  కోడలిగా భావించినా అక్కినేని వారి పెద్ద కోడలిగా ఆ బాధ్యత  ఆమెదే అవుతుంది కదండి. కానీ నాగ్ ఆ బాధ్యతను ప్రేమగా ఆమెకు అందించాడు.  హ్యాట్సాఫ్ టు నాగ్.

ఇక మెగాస్టార్ ఫ్యామిలీ గురించి చూస్తే… గతంలో చిరు చిన్న కూతురు శ్రీజ..  చిరు వ్యతిరేకంగా పలు నిర్ణయాలు తీసుకుంది. అయితే… ఓ పాప పుట్టిన తర్వాత ఆమె  జీవితంలో ఇబ్బందులు మొదలయ్యాయి. “నాన్నా.. నేను ఇబ్బందుల్లో ఉన్నాను” అని కూతురు ఆవేదన వ్యక్తం చేయగానే గత విషయాలను పూర్తిగా మర్చిపోయి తండ్రిగా ఆమెను ఆదుకున్నారు చిరు. అలానే చెర్రీ భార్య ఉపాసన పట్ల అంతకంటే ఆప్యాయతగా ఉంటాడని ఆమె చాలా సందర్భాల్లో చెప్పింది. నిజంగా చిరు రియల్ లైఫ్ మెగాస్టార్ కదండీ. ఇక నందమూరి ఫ్యామిలీ విషయానికొస్తే.. బాలయ్య కూతురు బ్రహ్మణి నారా వారి కోడలు. బ్రహ్మణి పెళ్లికాకముందు వారి కుటుంబంలో ఉన్న తగాదాలు తెలిసినవే. అయినా బ్రహ్మణి తన కోడలుకాగానే చంద్రబాబు అవన్నీ మర్చిపోయి.. ఇంటి పెత్తతాన్ని ఆమెకు అప్పగించాడు. ఒక స్టేట్ కి  సీఎం అయినా కానీ బ్రహ్మణిని కోడలిలా కాకుండా కూతురి కంటే ప్రేమగా చూసుకుంటున్నాడు. ఆమె కూడా చంద్రబాబుని మామగారిలా కాకుండా తండ్రి కంటే ఎక్కువగా ఆదరిస్తుంది.

ఒక స్టేట్ కి సీఎం అయినా, సినిమా హీరో అయినా వాళ్లు సామాన్యులకు రోల్ మోడల్స్. వాళ్లు సినిమాల్లో చేసే మంచి విషయాల్ని కొంతమంది నిజజీవితంలో చేస్తుంటారు. అయితే రోల్ మోడల్స్ నిజజీవితంలో చేసే మంచి పనులను కూడా మనం ఒక్క సారి గమనిస్తే అత్తింట్లో అడుగుపెట్టిన ఆడపిల్ల వరకట్న వేధింపుల్తో, అత్తగారి ఆరళ్లతో  అర్ధాంతరంగా తనువు చాలించదు. తమ కుటుంబాల బాధ్యత కోడలిది అని ఆ కుటుంబం వారు తెలుసుకుని కోడలికి పెద్దపీట వేయడం మంచిది. చీటికి మాటికీ వేధించకుండా ఆమెను కోడలిగా కాకుండా కూతురుగా భావించాలి. అత్తా ఓ ఇంటి కోడలే అని గుర్తుపెట్టుకోవాలి. అలానే కోడలు కూడా .. తన అత్తగారిని, మామగారిని తల్లితండ్రులుగా భావించి, వాళ్లు గభాలున ఓ మాట అన్నా సర్దుకుపోవాలి. కేవలం మొగుడు ఒక్కడే చాలు.. అతని కుటుంబంతో నాకేంటి పని అన్న మొండి వైఖరిని మార్చుకోవాలి. అప్పుడే మనం నిజజీవితంలో హీరోలుగా ఉంటాం. కోడల్ని కూతురిగా, అత్తమామల్ని తల్లితండ్రులుగా భావించిన రోజున మళ్లీ మన భారతదేశంలో ఉమ్మడి కుటుంబాలు నిలుస్తాయి. కలిసుంటే  కలదు సుఖం అని హాయిగా జీవించే రోజు వస్తుంది. 

SHARE