వారిపై కేసు ఆలోచనలో ఇల్లి ..

0
448

 ileana case aankhen2 movie producersనాజూకు తార ఇలియానా, బాలీవుడ్ లో భారీ ఛాన్సులను దక్కించుకునే ప్రయత్నంలో ఉంది. ఈ నేపథ్యంలో ఆమె అమితాబ్ బచ్చన్ లీడ్‌లో తెరకెక్కుతున్న ‘ఆంఖే 2’ సినిమా చేస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. బిగ్ బీ, అర్షద్ వార్సి, రెజీనా ప్రధాన పాత్రలను పోషించనున్నారు. గతంలో వచ్చిన ‘ఆంఖే’ సినిమాకి ఇది సీక్వెల్. రీసెంట్ గా ఈ సినిమాను లాంచ్ చేశారు. ఈ చిత్రంలో ఇలియానా నటిస్తున్నట్టు వేదికపై దర్శక నిర్మాతలు చెప్పారు.

అయితే ఈ సినిమాను ఇలియానా చేయడం లేదట. తాను ఓకే చెప్పక మునుపే తన పేరును ఎనౌన్స్ చేయడమే కాక తన వీడియోను కూడా  ప్రదర్శించడం ఆమెకి కోపాన్ని తెప్పించిందట. దీంతో తన పర్మిషన్ లేకుండా ఇలా చేసినందుకు దర్శకనిర్మాతలపై ఇల్లీబేబీ కేసు వేసే ఆలోచనలో ఉందని చెప్పుకుంటున్నారు.

Leave a Reply