రుస్తుంతో మరో అవకాశమా?

 iliana againa chance akshay kumar imran hashmi

టాలీవుడ్ లో స్టార్‌డమ్‌ ఎంజాయ్ చేస్తుండగానే ఇలియానా బాలీవుడ్‌కు వెళ్లింది. మంచి అవకాశాలు వస్తాయని ఆశపడ్డ ఈ సొగసరికి ఛాన్సులు కరవయ్యాయి. టాలీవుడ్-కోలీవుడ్ కూడా మొహం చాటేశాయి. దీంతో.. అమ్మడి కెరీర్ క్లోజ్ అయిపోయిందా అని అందరికీ డౌట్ వచ్చేసింది. కానీ, ‘రుస్తుం’లో గ్లామర్-నటనకు మంచి మార్కులు దక్కించుకున్న ఇల్లీ బేబీ మరో అవకాశం చేజిక్కించుకుంది.

ఇమ్రాన్ హష్మి లీడ్‌లో మిలాన్ లుత్రియా ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా ఓ చారిత్రాత్మక కథ అని అంటున్నారు. ఈ మూవీలో అజయ్ దేవగన్‌ సైతం మరో కీలక పాత్ర పోషిస్తున్నారు. పేరున్న నటీనటులు, ప్రతిభావంతుడైన డైరక్టర్ ప్రాజెక్ట్‌తో బాలీవుడ్‌లో కుదురుకోవచ్చని ఇలియానా ఆశిస్తోంది.

SHARE