పాక్ లో మోడీ అజెండా?

 Posted October 31, 2016

imran khan said about modi nawaz sharif
సరిహద్దుల్లో ఉద్రిక్తతలు…ఇంకా పూర్తిగా తొలగని యుద్ధమేఘాలు…కాశ్మీర్ లో చెలరేగుతున్న ఉగ్రమూకలు…కంటిముందు కనబడుతున్న వాస్తవాలు ఇలా ఉంటే పాకిస్తాన్ లో మన ప్రధాని మోడీ అజెండా అమలవుతోందంటూ బౌన్సర్ వేశాడు ఇమ్రాన్ ఖాన్.పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ కి వ్యతిరేకంగా ఇస్లామాబాద్ లో భారీ ఆందోళన కార్యక్రమం తలపెట్టిన పాకిస్తాన్ తెహ్రిక్ ఇన్సాఫ్ పార్టీ చైర్మన్ హోదా లో ఇమ్రాన్ మాట్లాడారు.పాకిస్తాన్ లో ప్రభుత్వానికి,సైన్యానికి మధ్య విబేధాల విషయం బయటికి రావడానికి కారణమని సమాచారశాఖ మంత్రి రషీద్ పై వేటేసాడు షరీఫ్. అటు సర్జికల్ స్ట్రైక్స్ ప్రభావం కూడా పాక్ ప్రజల్లో వుంది.ఈ పరిస్థితుల్లో భారత్ ప్రధాని మోడీ మాటల్నే నవాజ్ షరీఫ్ పాటిస్తున్నాడని చెప్పడం ద్వారా ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకత పెంచడానికి ఇమ్రాన్ ప్రయత్నిస్తున్నాడు.

భారత్ వ్యతిరేక పునాదుల మీదే రాజకీయ భవంతి నిర్మించుకోవాలని ఇమ్రాన్ భావిస్తున్నాడు.నవాజ్ అధికారంలో వున్నవాడు,గతంలో సైన్యం దాష్టీకాన్ని అనుభవించినవాడు,ఉగ్రవాదం పంజా రుచి చూసినవాడు కావడంతో పాక్ మీద ప్రపంచ దేశాల వ్యతిరేకతను గుర్తిస్తున్నాడు.అందుకే ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న సైనిక విధానాలని ఎంతోకొంత నివారించే ప్రయత్నం చేస్తున్నా ఆ దేశ రాజకీయాలు అందుకు అనుకూలంగా లేవు.ఇమ్రాన్ లాంటి నాయకుడు కూడా మతాన్ని రాజకీయాలకి వాడుకోవాలనుకోవడం దారుణం.నిజంగా మోడీ చెప్పినట్టు నవాజ్ వినే పరిస్థితి ఉంటే భారత్ సైనికులు ఉగ్రదాడికి బలయ్యేవారా?

SHARE