ట్రంప్ ని వింతకోరిక కోరిన ఇమ్రాన్..

0
239
imran khan shocking letter to trump

Posted [relativedate]

imran khan shocking letter to trump
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయాలపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు రావడం చూస్తూనే వున్నాం.కానీ ఓ పాకిస్తానీ రాజకీయ నేత మాత్రం అమెరికాకి విదేశీయుల రాక ని నియంత్రిస్తూ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాల్ని స్వాగతించారు.ఆయనెవరో కాదు.తెహ్రిక్ ఏ ఇన్సాఫ్ పార్టీ అధినేత,అలనాటి క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్.అంతటితో ఆగని ఇమ్రాన్ ఇంకో అడుగు ముందుకెళ్లి దయ చేసి పాకిస్తానీలు అమెరికాకి రాకుండా వీసాలు నిరాకరించాలని ట్రంప్ ని కోరాడు.అలా చేస్తే పాకిస్తానీలు విదేశాలకి వెళ్లకుండా సొంత దేశ అభివృద్ధికి కృషి చేస్తారని ఇమ్రాన్ అభిప్రాయపడ్డారు. అమెరికా తమకి వీసాలు నిరాకరిస్తే ఇరాన్ తరహాలో స్వతంత్రంగా అభివృద్ధి చెందుతామే గానీ భయపడబోమని ఇమ్రాన్ అన్నారు.పాకిస్థానీలకి ఎంత ధైర్యం వున్నా శాంతమూర్తులని చెప్పాడు. సగటు పాకిస్తానీ భారత్ తో యుద్ధం కోరుకోవడం లేదని ఇమ్రాన్ అభిప్రాయపడ్డారు.ఏదేమైనా ట్రంప్ ని వింతకోరిక కోరి ఇమ్రాన్ పాకిస్థానీల్లో కొత్త చర్చకి తెర లేపాడు.

Leave a Reply