ఐటీ ఉచ్చులో చిన్నమ్మ?

0
382
income tax raid on sasikala
Posted [relativedate]
income tax raid on sasikalaశశికళకు  ఢిల్లీ నుంచి ఎన్ని రకాలుగా సిగ్నల్స్ పంపినా లాభం లేకపోయింది. ఏ మాత్రం వెనక్కు తగ్గకుండా ఆమె పార్టీ పగ్గాలు స్వీకరించేందుకు మొగ్గు చూపింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ నుంచి చిన్నమ్మపై యాక్షన్ ప్లాన్ మొదలు కానుందన్న ప్రచారం జరుగుతోంది. మన్నార్గుడి మాఫియా లక్ష్యంగా ఐటీ దాడులు జరగొచ్చని టాక్. ఈ మధ్య జరిగిన చెన్నైలో జరిగిన ఐటీ దాడులే అందుకు నిదర్శనమన్న వాదన వినిపిస్తోంది.
             జయలలిత మరణం తర్వాత… ఇప్పటిదాకా తమిళనాడులో ఎనిమిది మంది రాజకీయ, అధికార ప్రముఖులపై ఐటీ సోదాలు జరిగాయి. అప్పటిదాకా సీఎస్ గా ఉన్న రామ్మోహన రావుకు కూడా వదల్లేదు. ఈ దెబ్బతో ఆయన మాజీ సీఎస్ గా మిగిలిపోయారు. ఐటీ ఉచ్చులో పడి శేఖర్ రెడ్డి  సమస్యల సుడిగుండంలో చిక్కుకున్నారు. వీరంతా చిన్నమ్మ బ్యాచ్ కావడంతో… ఇక తర్వాతి వంతు ఆమెదేనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
                 రెండు రోజుల క్రితమే తమిళనాడుకు పక్క రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో ఐటీ, ఇతర శాఖల సిబ్బంది చెన్నైకి చేరుకున్నారట. కేంద్ర బలగాలను కూడా అదే స్థాయిలో మోహరించారు. ప్రముఖులే లక్ష్యంగా ఐటీ సోదాలు జరిగే అవకాశమునట్లు సంకేతాలు వస్తున్నాయి. తమిళనాడులోని అధికారపార్టీపైనే ఈ టార్గెట్ ఉందని ప్రచారం సాగుతోంది. సీఎం పన్నీర్ సెల్వం సైలెంట్ గా ఉన్నా… ఈ విషయంలో ఇప్పటికే ఢిల్లీ పెద్దలతోనూ మాట్లాడారట. ఇలా ఏ రకంగా చూసినా ఐటీ తర్వాతి టార్గెట్ చిన్నమ్మనేని అన్నాడీఎంకేలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం శశికళ పోయెస్ గార్డెన్ బంగళాలోనే నివాసముంటున్నారు. కాబట్టి త్వరలోనే పోయెస్ గార్డెన్ లో ఐటీ అధికారులు అడుగుపెడతారని విశ్లేషకులు కూడా అంచనా వేస్తున్నారు. అదే జరిగితే శశికళ రాజకీయ భవిష్యత్తు ఒక్కరోజులో తలకిందులైపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.!!

Leave a Reply