మోడీ టార్గెట్ గా ఇండిపెండెంట్ ప్లాన్!!

Posted January 29, 2017

independent person targetting modi
యూపీ ఎన్నిక‌ల స‌మ‌రాంగ‌ణంలో ప్ర‌ధాన పోటీ కాంగ్రెస్-ఎస్పీ , బీజేపీ కూట‌ముల మ‌ధ్య ఉంది. బీఎస్పీ ఉన్నా ఆ పార్టీ ఈసారి వెనుకంజ‌లో ఉంది. కాంగ్రెస్-ఎస్పీ కూట‌మి అఖిలేశ్ యాద‌వ్ పై ఆశ‌లు పెట్టుకోగా.. బీజేపీ మాత్రం మోడీయే గ‌ట్టెక్కిస్తార‌ని ఆశిస్తోంది. అయితే బీజేపీ వైపు మొగ్గు క‌నిపిస్తున్న త‌రుణంలో… మోడీని ఇమేజ్ ను డ్యామేజ్ చేసేందుకు కొన్ని పార్టీలు ప్ర‌య‌త్నిస్తున్నాయ‌ట‌. అందులో భాగంగా ఒక పార్టీ మోడీయే టార్గెట్ గా ఒక ఇండిపెండెంట్ అభ్య‌ర్థిని రంగంలోకి దింపారు. అత‌ను చేస్తున్న వినూత్న ప్ర‌చారమే అందుకు నిద‌ర్శ‌నంగా క‌నిపిస్తోంది. అత‌ను చేస్తున్న ప్ర‌చారంలో వినూత్నంగా ఉండ‌డ‌మే కాకుండా ప్ర‌చారానికి సంబంధించిన అత‌ని వీడియోల‌న్నీ ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారాయి.

ఆగ్రా నుంచి ఇండిపెండెంట్ అభ్య‌ర్థిగా చౌద‌రి అనే వ్య‌క్తి పోటీ చేస్తున్నాడు. ఇత‌ను పేరుకే నిల్చున్నాడ‌ట‌. ఇతని ఏకైక ల‌క్ష్యం ఇప్పుడు ప్ర‌ధాన‌మంత్రి మోడీ ఇమేజ్ ను దెబ్బ‌తీయడ‌మే. అందుకోసం అత‌ను చాలా తెలివిగా నెగెటివ్ ప్ర‌చారం చేస్తున్నాడు. రాజ‌కీయాల్లోకి డ‌బ్బు సంపాదించ‌డానికే వ‌చ్చానంటూ ప్ర‌క‌టించాడు. అంతేకాదు తాను గెలిచి… ప్ర‌జ‌ల‌ను ఫూల్స్ చేస్తానంటున్నాడు. తానే కాదు అంద‌రూ డ‌బ్బు సంపాదించడానికే పాలిటిక్స్ లోకి వ‌స్తారంటూ కుండ‌బ‌ద్ద‌లు కొట్టాడు. మ‌రో అడుగు ముందుకేసి త‌న అస‌లు ఎజెండాను వివ‌రించాడు. ప్రజల్ని పిచ్చోళ్లని చేసి…ఒక వ్యక్తి దేశాన్నేలుతున్నపుడు ..తానెందుకు చేయలేనని ప్రశ్నించాడు. తానూ ఆయన అడుగుజాడల్లోనే నడుస్తున్నాని చెప్పుకొచ్చాడు .ప్రజలను ఫూల్స్ ని చేసిన ఎవరైనా ప్రధానమంత్రి కావచ్చు. దానికి కొంత టాలెంట్ ఉండాలంటూ వ్యాఖ్యానించడం గమనార్హం.

ఈ నెగెటివ్ ప్ర‌చారం ఇప్పుడు యూపీలో హాట్ టాపిక్ గా మారింది. చౌద‌రి వెన‌క కాంగ్రెస్-ఎస్పీ కూట‌మి ఉంద‌న్న ఊహాగానాలు వ‌స్తున్నాయి. మోడీ ఇమేజ్ ను దెబ్బ‌తీసేందుకు ఆ పార్టీలు చౌద‌రిని నిల‌బెట్టాయ‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. చాప కింద నీరులా అత‌ను చేస్తున్న నెగెటివ్ ప్ర‌చారం ఓట‌ర్ల‌ను ఆక‌ట్టుకుంటోంద‌ట‌. బీజేపీకి షాకిచ్చేందుకు క‌రెక్ట్ టైమ్ లో ఇత‌న్ని పావుగా వాడుకుంటున్నార‌ని బీజేపీ విమ‌ర్శిస్తోంది. ఇత‌ని ప్ర‌చారంతో ఓట‌ర్లు కూడా ఆలోచ‌న‌లో ప‌డ్డార‌ట‌. అవునా.. మోడీ అలా చేస్తున్నారా… అంటూ మాట్లాడుకుంటున్నార‌ట‌. ఏదేమైనా చౌద‌రి చేస్తున్న ప్ర‌చారం మాత్రం క‌మ‌ల‌నాథుల‌కు మాత్రం ఇబ్బందుల‌ను తెచ్చిపెడుతోంది.

SHARE