పాక్ కు బుద్ధి చెప్పిన భారత్

Posted September 29, 2016

india

యురి ఉగ్రవాది దాడి తర్వాత భారత్ మౌనం వహించదనుకున్న పాక్ కు షాక్ తగిలింది. పొరుగు దేశం ఏం చేసినా చూస్తూ ఉరుకోబోమని భారత్ తాజా దాడులతో స్పష్టం చేసింది. గత అర్ధరాత్రి భారత బలగాలు పాక్ ఆక్రమిత కాశ్మిర్ లోని మూడు ఉగ్రవాద స్థావరాలపై దాడి చేశాయి. ఈ దాడిలో ఉగ్రవాదులతో పాటు వారికి అండగా వుంటున్న పాక్ సైనికులు కూడా కొందరు చనిపోయారు. దాడి తర్వాత పాకిస్థాన్ కి భారత విదేశాంగ సఖ సమాచారం కూడా ఇచ్చింది.

యురి ఘటన తర్వాత రెచ్చిపోయిన పాకిస్థాన్ తాజా దాడితో కలవరపడింది. భారత్ దాడిని ఖండిస్తున్నట్టు ప్రకటించి అయితే తనకు పరాభవం జరగలేదని పాక్ బొంకుతోంది. భారత్ దళాలు కేవలం LOC దగ్గర కాల్పులు జరిపాయని ప్రపంచానికి చెప్పుకుంటోంది. ఏమైనా పరస్పరదాడులతో భారత్, పాక్ మీద యుద్ధమేఘాలు ముసురుకుంటున్నాయి.

SHARE