తీరిన భారత హాకీ 7 ఏళ్ల కల ..

  india hockey team got 7 years dream
గ్రూప్ మ్యాచ్ లో భాగంగా అర్జంటైనాతో జరిగిన హాకీ మ్యాచ్ లో భారత్ 2-1 తేడాతో విజయం సాధించింది. మొదటి మూడు క్వార్టర్లలో భారత ఆటగాళ్లు తిరులేని రీతిలో ఆటతీరును ప్రదర్శించారు. ఏడో నిమిషంలో లభించిన పెనాల్టీ కార్నర్‌ను చింగల్‌సేన గోల్‌గా మలచగా.. 34వ నిమిషంలో కోఠాజిత్‌ తొలి ఫీల్డ్‌గోల్‌ చేసి ఆధిక్యాన్ని 2-0కు తీసుకెళ్లాడు. ఆట పూర్తిగా టీమిండియా అదుపులో ఉన్నా..

నాలుగో క్వార్టర్‌లో అర్జెంటీనా ప్లేయర్ గొంజాలో గోల్‌ చేయడంతో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. బ్రెజిల్‌పై ఆఖరి మూడు సెకన్లలో ఓడిపోయిన విధానం గుర్తుండటంతో అర్జెంటీనాను అడ్డుకోవాలనే తపనలో భారత ఆటగాళ్లు డిఫెన్స్‌లో పొరపాట్లు చేస్తూ ప్రత్యర్థికి వరుసగా పెనాల్టీ కార్నర్‌ అవకాశాలు ఇచ్చారు. ఆట ఏడు నిమిషాల్లో ముగుస్తుందనగా భారత్‌ గోల్‌పోస్టు దగ్గర అర్జెంటీనా ఆటగాళ్లు తీవ్రంగా దాడులు చేశారు. గోల్‌కీపర్‌, కెప్టెన్‌ శ్రీజేశ్‌ రెండుసార్లు అర్జెంటీనా గోల్‌ అవకాశాలను సమర్థంగా అడ్డుకోవడంతో భారత టీం వూపిరి పీల్చుకుంది. ప్రత్యర్థికి మరో అవకాశం ఇవ్వకపోవడంతో భారత్ విజయాన్ని సాధించింది. 2009 తర్వాత అర్జెంటీనాను భారత్‌ ఓడించడం ఇదే మొదటి సారి.

SHARE