Posted [relativedate]
క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న భారత- న్యూజిలాండ్ అంతర్జాతీయ వన్డే క్రికెట్ మ్యాచ్ వీక్షించేందుకు టిక్కెట్ల విక్రయాన్ని అక్టోబరు 25 నుండి ప్రారంభించనున్నట్లు జాయింట్ కలెక్టర్ జె.నివాస్ తెలిపారు. నగరంలోని అన్ని మీసేవ, ఈసేవ కేంద్రాల్లో టిక్కెట్లను విక్రయిస్తారని పేర్కొన్నారు. క్రికెట్ అభిమానులకోసం మీసేవ కేంద్రాల ద్వారా 12,000 టిక్కెట్లను అందుబాటులో వుంచనున్నట్లు వెల్లడించారు. రూ.400 నుండి రూ.5,000 వరకు నాలుగు కేటగిరీల్లో టిక్కెట్లు లభ్యమవుతాయన్నారు. రూ.400, రూ.1000, రూ.1500, రూ.5000 ధరల్లో టిక్కెట్లను ఆయా మీసేవ కేంద్రాల వద్ద పొందవచ్చన్నారు. భారత- న్యూజిలాండ్ జట్ల మధ్య వన్డే మ్యాచ్ ఈనెల 29న ఏసిఏ-విడిసిఏ క్రికెట్ స్టేడియంలో డై అండ్ నైట్ పద్ధతిలో జరగనుంది.