యుద్ధ మేఘం….

Posted September 29, 2016

  india pakistan war

భారత్- పాక్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి.అర్ధరాత్రి నుంచి తెల్లవారు జాము దాకా భారత భద్రతా బలగాలు జరిపిన దాడిలో 35 నుంచి 40 మంది ఉగ్రవాదులు, 9 మంది పాక్ సైనికులు మరణించారు.దీనితో అటు వైపు నుంచి ప్రతీకార చర్యలు మొదలు కావచ్చన్న అనుమానంతో సైన్యం అప్రమత్తమైంది. సరి హద్దు రాష్ట్రాల్లో 10 కిలో మీటర్ల మేర గ్రామాలను ఖాళీ చేయించాలని కేంద్రం ఆయా రాష్ట్రాలను ఆదేశించింది. ఏ పరిస్థితి ఎదురైనా ఎదుర్కోవడానికి సైన్యం సర్వ సన్నర్థంగా ఉంది.. రక్షణ మంత్రి పారికర్ తో ఆర్మీ చీఫ్ భేటీ అయ్యి పరిస్థితులపై చర్చించారు…

ప్రధాని నరేంద్ర మోడీ కూడా సర్జికల్ స్ట్రెక్ వివరాల్నిరాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, మాజీ ప్రధాని మన్మోహన్ తదితరులకు ఫోన్ ద్వారా వివరించారు. తాజా పరిణామాలపై కేంద్రం అఖిల పక్ష సమావేశం కూడా ఏర్పాటు చేసింది. కాంగ్రెస్ సహా దాదాపు అన్ని పక్షాలు ప్రభుత్వం ఏ చర్య తీసుకున్నాఅండగా ఉంటామని స్పష్టం చేశాయి. చంద్రబాబు కెసిఆర్ సహా వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా కేంద్రం, సైన్యం చర్యల్ని ప్రశంసించారు..

SHARE