భారత్ స్పీడ్..

0
502

crisil1
భారత్‌ఈ ఏడాది స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)కి సంబంధించి రెండు కీలక ఆర్థిక సంస్థలు- విభిన్న అంచనాలు వెలిబుచ్చాయి. అంతర్జాతీయ ఆర్థిక సేవల దిగ్గజం- మోర్గాన్ స్టాన్లీ భారత్ వృద్ధి రేటు క్రితం అంచనాలను 20 బేసిస్ పాయింట్లు పెంచింది. ఇంతక్రితం ఈ అంచనా 7.5 శాతం కాగా దీనిని 7.7 శాతానికి పెంచుతున్నట్లు తన తాజా పరిశోధనా నివేదికలో పేర్కొంది. ఇక ఆసియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ (ఏడీబీ) తన నివేదికలో ఈ అంచనాలను 7.4 శాతానికి పరిమితం చేసింది. వచ్చే ఏడాది ఈ రేటు 7.8 శాతంగా ఉంటుందని ఆసియా అభివృద్ధికి సంబంధించి తన అనుబంధ అవుట్‌లుక్ 2016లో విశ్లేషించింది. కాగా, గ్రామీణ భారతంపై ద్రవ్యోల్బణం ప్రభావం తీవ్రంగా ఉందని అంతర్జాతీయ ఆర్థిక విశ్లేషణా సంస్థ క్రిసిల్ తన తాజా నివేదికలో వివరించింది.

Leave a Reply