వెస్టిండీస్ లో తెగ ఎంజాయ్ చేస్తున్న టీమిండియా

167
Spread the love

india1.....

వెస్టిండీస్ టూర్ లో విరాట్ కొహ్లీ సేన తెగ ఎంజాయ్ చేస్తోంది. నాలుగు టెస్టుల సిరీస్ కోసం విండీస్ వెళ్లిన టీమిండియా ప్రస్తుతం అక్కడి అందాలను ఆస్వాదిస్తోంది. చీఫ్ కోచ్ అనిల్ కుంబ్లే కుర్రాళ్లకు స్వేచ్ఛనివ్వడంతో ఫుల్ జోష్ తో ఎంజాయ్ చేస్తున్నారు. ఐచే ఈ ఎంజాయ్ మెంట్ వెనక కోచ్ కుంబ్లే వ్యూహం ఉందని తెలుస్తోంది.

జట్టులో ఉన్న చాలా మంది క్రికెటర్లకు విండీస్ టూర్ కొత్త. అక్కడి పరిస్థితులపై వారికి అవగాహన లేదు. అందుకే కరీబియన్ దీవుల్లో చక్కర్లు కొడితే అక్కడి వాతారావణం బాగా అలవాటవుతుందన్నదీ కుంబ్లే ప్లాన్. తొలుత సెయింట్ కీట్స్ బీచ్ లో వాలీబాల్ అడిన టీమిండియా ఆటగాళ్లు ప్రస్తుతం సెయింట్ నెవిస్ లో ఎంజాయ్ చేస్తున్నారు. అక్కడి ప్రకృతి అందాలను ఆస్వాదించడంతో పాటు పరిస్థితులను అలవాటు చేసుకుంటున్నారు.

నీలిరంగులో అందంగా కనిపించే సెయింట్ నెవిస్ బీచ్ లో తొలు బోటుపై షికారుకెళ్లిన అటగాళ్లు.. ఆ తర్వాత అక్కడే వాలీబాల్ ఆడారు. కెప్టెన్ విరాట్ కొహ్లీ, వైస్ కెప్టెన్ అజింక్య రహానే, రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, చటేశ్వర్ పుజారా, కే.ఎల్ రాహుల్, ఇషాంత్, అశ్విన్, స్టువర్ట్ బిన్నీ ఇలా అందరూ ఎంతో ఉత్సాహంగా కనిపించారు. వీరితో పాటు కోచ్ అనిల్ కుంబ్లే, బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్, చీఫ్ సెలెక్టర్ సందీప్ పాటిల్ కూడా ఉన్నారు. కొత్త ప్రదేశంలో సముద్రంలో స్విమ్ చేయడం వంటి సాహసాలు చేస్తే క్రికెటర్లలో కాన్ఫిడెన్స్ పెరుగుతుందన్నది కుంబ్లే నమ్మకం అందుకే క్రమశిక్షణ పేరుతో కఠినంగా ఉంటూనే.. క్రికెటర్లకు స్వేచ్ఛనిస్తున్నాడు.

టూర్ లో భాగంగా వెస్టిండీస్ తో నాలుగు టెస్టులాడనున్న టీమిండియా ఇప్పటికే వెస్టిండీస్ ప్రెసిడెంట్స్ ఎలెవన్ తో రెండు రోజుల మ్యాచ్ ఆడనుంది. గురవారం మరో వార్మప్ మ్యాచ్ ఆరంభమవుతుంది. రెండు జట్ల మధ్య ఫస్ట్ టెస్ట్ ఈనెల 21న ప్రారంభమవుతుంది.