మూడో టెస్ట్ లో భారత్ ఆధిక్యం…

Posted [relativedate]

Image result for india vs england 3rd test match 3rd day

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 134 పరుగుల ఆధిక్యం సాధించింది. మూడో రోజు 271/6 ఓవర్‌నైట్‌ స్కోర్‌తో ఆట ప్రారంభించిన భారత జట్టు లో స్పిన్నర్లు తమ జోరు చూపడంతో భారీ స్కోరు చేసింది. అశ్విన్‌ (72; 113 బంతుల్లో 11×4), జడేజా (90; 170 బంతుల్లో 10×4, 1×6) 7వ వికెట్‌కు 97 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే జట్టు స్కోరు 301 వద్ద అశ్విన్‌ స్టోక్స్‌ బౌలింగ్‌లో బట్లర్‌ చేతికి చిక్కాడు. ఆ తర్వాత వచ్చిన జయంత్‌ యాదవ్‌ (55; 141 బంతుల్లో 5×4) అర్ధశతకంతో సత్తాచాటాడు.

Image result for india vs england 3rd test match 3rd day జడేజాతో 8వ వికెట్‌కు 80 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడంతో స్కోరు 417 పరుగులకు చేరింది. ఉమేశ్‌యాదవ్‌ 12 పరుగులు చేశాడు.భారత్‌ ఆలౌటైన తర్వాత రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ఇంగ్లాండ్‌ భారీ స్కోరు సాధించాలని పట్టుదలతో వుంది.గారిత్ బట్టి (౦), జో రూట్‌ (36) క్రిస్ లో వున్నారు . అట ముంగిసే సమయానికి ఇంగ్లాండ్ 78 /4  స్కోర్ చేసింది .

Leave a Reply