మూడో టెస్టులో పట్టుబిగిస్తోంది టీమిండియా. రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి మూడు వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. రహానె(51 బ్యాటింగ్) హాఫ్ సెంచరీ చేయగా… మరో ఎండ్‌లో రోహిత్ శర్మ(41 బ్యాటింగ్) స్కోరు పెంచుతూ పోతున్నాడు. అంతకు ముందు విండీస్‌ను తొలి ఇన్నింగ్స్‌లో 225 పరుగులకు ఆలౌట్ చేసి 128 పరుగుల ఆధిక్యం సాధించింది.
ప్రస్తుతం భారత్ మొత్తం 285 పరుగుల ఆధిక్యంలో ఉంది. విండీస్ బౌలర్లలో కమిన్స్ రెండు వికెట్లు తీయగా, ఛేజ్ ఒక వికెట్ తీశాడు.సిరీస్‌లో తొలి మ్యాచ్ ఆడిన పేసర్ భువనేశ్వర్ కుమార్ (5/33)తో విండీస్ బ్యాటింగ్ ఆర్డర్ ను కుప్పకూల్చాడు. లంచ్ విరామానికి 193/3 పరుగులు చేసింది విండీస్. రెండో సెషన్ లో భువనేశ్వర్ బౌలింగ్ విశ్వరూపంతో 202/3 నుంచి 225/10తో ఆలౌట్ అయ్యింది. బ్లాక్‌వుడ్ (20), శామ్యూల్స్ (48), హోల్డర్ (2), జోసెఫ్ (0), డౌరిచ్ (18)లను పెవిలియన్ చేర్చాడు భువనేశ్వర్.