మూడో టెస్ట్ లో డీ కొడ్తున్న విండీస్ ..

  india west indies 3rd test west indies break india top order

టీమిండియా దూకుడికి మూడో టెస్టులో కళ్లెం వేసింది విండీస్. తొలి రోజు ఆటలో విండీస్ బౌలర్లు భారత బ్యాట్స్ మెన్ ను కట్టడి చేశారు. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌.. ప్రారంభంలోనే రెండు వికెట్లను కోల్పోయింది. ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌(1)తో పాటు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ (3) త్వరగానే ఔటయ్యారు. ఈ స్థితిలో కేఎల్‌ రాహుల్‌(50), రహానె(35) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. ఈ జోడి మూడో వికెట్‌కు 58 పరుగులు జత చేయడంతో భారత్‌ కోలుకుంది. హాఫ్ సెంచరీ చేసిన రాహుల్‌తో పాటు రోహిత్‌ శర్మ(9) కూడా ఔట్ అవ్వడంతో భారత్‌ మళ్లీ కష్టాల్లో పడింది.

87పరుగులకు 4వికెట్లతో కష్టాల్లో ఉన్న భారత్‌ను అశ్విన్‌(75 నాటౌట్‌), రహానె(35) ఆదుకోవడంతో తొలి రోజు ఆటముగిసే సమయానికి టీమిండియా 5 వికెట్ల నష్టానికి 234 పరుగులు చేసింది. అశ్విన్‌ కు తోడుగా వచ్చిన సాహ(45 నాటౌట్) ఆరో వికెట్‌కు అజేయంగా 108 పరుగులు భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ మ్యాచ్‌తో అరంగేట్రం చేసిన విండీస్‌ బౌలర్‌ జోసెఫ్‌ రెండు వికెట్లు తీయగా, ఛేజ్‌ రెండు, గాబ్రియల్‌ ఒక వికెట్‌ తీశారు.

SHARE