ఇంగ్లాండ్ పై భారత్ ఘన విజయం..

Posted [relativedate]

india won india vs england test seriesభారత జట్టు అద్భుతమైన విజయం సాధించింది. చెన్నైలోని చెపాక్ స్టేడియం లో జరిగిన ఐదో టెస్టులో భారత జట్టు ఇన్నింగ్స్ 75 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇప్పటికే టెస్టు సిరీస్ ను సొంతం చేసుకున్న భారత జట్టు, ఐదు టెస్టుల సిరీస్ లో 4-0 తేడాతో విజయం సాధించింది. ఐదో టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ జట్టు తొలి ఇన్నింగ్స్ లో 477 పరుగులు చేసింది. దీటుగా ఆడిన భారత జట్టు కేఎల్ రాహుల్ (199), కరుణ్ నాయర్ (303) రాణించడంతో తొలి ఇన్నింగ్స్ లో 759 పరుగులు చేసింది.

ఈ భారీ స్కోర్ కారణం గా ఇంగ్లండ్ జట్టు భారత విజయాన్ని అడ్డుకునేందుకు తీవ్రంగా పోరాడినా ఫలితం దక్కలేదు 282 పరుగులు వెనుకబడ్డ ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ లో కేవలం 207 పరుగులకే రవీంద్ర జడేజా అద్భుత బౌలింగ్ తో కట్టడి చేసాడు దీంతో ఇంగ్లండ్ జట్టు చివరి టెస్టును ఇన్నింగ్స్ 75 పరుగుల తేడాతో కోల్పోయింది. ఏడు వికెట్లు తీసిన జడేజా కెప్టెన్ కుక్ ను సిరీస్ లో ఆరుసార్లు అవుట్ చేయడం , టెస్టు విజయం ఆనందాన్నిచ్చిందని కోహ్లీ తెలిపాడు.

ఏకంగా ట్రిపుల్‌ సెంచరీతో కరణ్ నాయర్

Image result for karun nair

జట్టులోకొచ్చిన కరుణ్‌ నాయర్‌.. తన సత్తా ఏమిటో చూపించాడు..! పుజారా, కోహ్లీ, విజయ్‌ వంటి స్టార్‌ ఆటగాళ్లుఓపెనర్‌ రాహుల్‌ ఒక్క పరుగు తేడాతో ‘డబుల్‌’ సెంచరీ మిస్ ఈ సమయం లో నాయర్ వీళ్లందరి స్కోర్ ని ఒక్కడే చేసాడు. రాహుల్‌, అశ్విన్‌, జడేజాలతో కీలక భాగస్వామ్యాలు నెలకొల్పిన నాయర్‌ కెరీర్‌లో తొలి సెంచరీనే ట్రిపుల్‌ సెంచరీగా మలచి.. భారత్ కు 282 పరుగుల భారీ ఆధిక్యమందించాడు.
కరుణ్‌ నాయర్‌ (381 బంతుల్లో 32 ఫోర్లు, 4 సిక్సర్లతో 303 నాటౌట్‌) అజేయ ట్రిపుల్‌ సెంచరీతో చెలరేగడంతో ఇంగ్లండ్‌పై భారత భారీస్కోరు సాధించింది. ఒక్కరోజే 232 రన్స్‌!: నాలుగో రోజు ఆటలో కరుణ్‌ నాయర్‌ ఇన్నింగ్సే హైలైట్‌! ఓవర్‌నైట్‌ స్కోరు 71తో ఇన్నింగ్స్‌ కొనసాగించిన నాయర్‌ సోమవారం ఒక్కరోజే 232 రన్స్‌ జతచేశాడు. ఒకేరోజు సెంచరీ, డబుల్‌ సెంచరీ, ట్రిపుల్‌ సెంచరీ మార్కులను అధిగమించాడు. అలాగే కెరీర్‌లో తొలి సెంచరీనే ట్రిపుల్‌గా మలిచిన మూడో ఆటగాడిగా ఘనత సాధించాడు.

బౌండ్రీతో డబుల్‌..: టీ బ్రేక్‌ నుంచి రాగానే జెన్నింగ్స్‌ బౌలింగ్‌లో చక్కటి కవర్‌డ్రైవ్‌ సాధించిన నాయర్‌ 306 బంతుల్లో డబుల్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కరుణ్‌కు జతకలిసినజడేజా 52 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకోగా.. కరుణ్‌ కూడా ట్రిపుల్‌ సెంచరీ కి చేరువయ్యాడు.కరుణ్‌ 299 పరుగుల వద్ద ఉండగా.. డాసన్‌ బౌలింగ్‌లో జడేజా భారీ షాట్‌కు ప్రయత్నించి అవుటయ్యాడు.

ట్రిపుల్ సెంచరీ సాధించిన కరణ్ కు అభినందనలు వెల్లువ…

***ట్రిపుల్‌ సెంచరీ చేసినందుకు అభినందనలు. నీ అసాధారణ ఇన్నింగ్స్‌కు మేమంతా గర్విస్తున్నాం. -ప్రధాని మోదీ .
***భారత్-ఎ టీమ్‌ కోచ్‌ రాహుల్‌ ద్రావిడ్‌ వ్యూహాలు గొప్ప ఫలితాలిస్తున్నాయి. జయంత యాదవ్‌, కరుణ్‌ నాయర్‌ మెరుపులే ఇందుకు ఉదాహరణ.
-బీసీసీఐ చీఫ్‌ అనురాగ్‌ ఠాకూర్‌
***300 క్లబ్‌లోకి కరుణ్‌కు స్వాగతం. గత 12 ఏళ్లుగా నన్ను ఒంటరితనం వేధిస్తోంది. నీకు అంతా మంచి జరగాలి. నీ ఇన్నింగ్స్‌ మజాను ఇచ్చింది. -సెహ్వాగ్‌
***కరుణ్‌కి 300 క్లబ్‌లోకి ఆహ్వానం. గొప్ప ఇన్నింగ్స్‌తో అదరగొట్టావు. ఆల్‌ ద బెస్ట్‌. -క్రిస్‌గేల్‌
*** వీరిద్దరూ కర్ణాటక దిగ్గజ ఆటగాళ్లు గుండప్ప విశ్వనాథన్‌, రాహుల్‌ ద్రావిడ్‌లను గుర్తుకు తెస్తున్నారని ప్రశంసించాడు. — గవాస్కర్
*** మూడో ఇన్నింగ్స్‌లోనే నాయర్‌ ట్రిపుల్‌ సాధించాడు. ఈ క్రమంలో తొమ్మిది ఇన్నింగ్స్‌ల తర్వాత త్రిశతకం సాధించిన లెన్‌ హటన్‌ను వెనక్కునెట్టాడు.

Leave a Reply