పేటిఏం సిరీస్ భారత్ కైవసం..పోరాడి ఓడిన ఇంగ్లాండ్

Posted [relativedate]

india won the 2nd one day match against england‘మహా’ ‘యువరాజ’సం

2011 తర్వాత యువరాజ్ శతకం..

2013 తర్వాత ధోని శతకం..

క్యాన్సర్ ని గెలిచి వచ్చిన యువరాజ్ మ్యాచ్ గెలిపించే ఇన్నింగ్స్ ఆడాడు. కెప్టెన్సీ భాధ్యత ని వదిలించింకున్న మహి భాధ్యతాయుతమైన సెంచరీ తో అభిమానులని అలరించే చేశాడు. 25 పరుగులకే 3 వికెట్లను కోల్పోయి ఇబ్బందుల్లో ఉన్న జట్టు ని ఇద్దరు సీనియర్ ఆటగాళ్లు గెలిపించారు. 256 పరుగుల తో నాలుగో వికెట్ కి అత్యధిక భాగస్వామ్య రికార్డు రెండో స్థానం లో నిలిచారు. మొదటి  స్థానం లో ఉన్నది కూడా ఉన్నది కూడా మన జట్టే కావడం విశేషం.

కటక్ లో పరుగుల వర్షం కురిసింది. ఒక్క రోజులో 747 పరుగులు నమోదయ్యాయి. యువరాజ్, ధోని ల శతకాల సాయం తో భారత్ 381 పరుగుల భారీ స్కోర్ సాధించింది. భారీ లక్ష్య చేధన లో ఇంగ్లాండ్ బాగా పోరాడినా విజయానికి కొద్ది దూరంలో ఆగిపోయింది. ఇంగ్లాండ్ కెప్టెన్ మోర్గాన్ కూడా సెంచరీ సాదించాడు. భారత్ 15 పరుగుల తేడా తో పే టిఏం సిరీస్ రెండో వన్డే లో గెలిచింది. తద్వారా సిరీస్ విజయం సాధించింది. మాన్ ఆఫ్ ది మ్యాచ్ గా యువరాజ్ ఎంపికయ్యాడు.  ధోనీ వన్డేల్లో రెండువందలకు పైగా సిక్సులు కొట్టిన ఏకైక భారత బ్యాట్స్ మన్ అనే ఘనతను సంపాదించుకున్నాడు.

స్కోర్ వివరాలు:

భారత్ ఇన్నింగ్స్:
కే ఎల్ రాహుల్ 5 (5 బంతుల్లో,1*4,0*6)
శిఖర్ ధావన్ 11 (15 బంతుల్లో,2*4,0*6)
విరాట్ కోహ్లీ 8 (5బంతుల్లో,2*4,0*6)
యువరాజ్ సింగ్ 150 (127బంతుల్లో, 21*4,3*6)
ఎం ఎస్ ధోని 134 (122బంతుల్లో,10*4, 6*6)
కేదార్ జాదవ్ 22 (10బంతుల్లో,3*4,1*6)
హార్ధిక్ పాండ్య 19* (9బంతుల్లో,2*4,1*6)
ఆర్ జడేజా 16* (8 బంతుల్లో,1*4,1*6)
   
ఇంగ్లండ్ ఇన్నింగ్స్:
జేసన్ రాయ్ 82 (73 బంతుల్లో,  9*4,*6)
అలెక్స్ హేల్స్ 14 (12 బంతుల్లో,  3*4,*6)
జో రూట్ 54 (55 బంతుల్లో,  8*4,*6)
ఇయాన్ మోర్గాన్ 102 (81 బంతుల్లో,  6*4,*6)
బెన్ స్టోక్స్ 1 (3 బంతుల్లో,  0*4,*6)
జోస్ బట్లర్ 10 (9 బంతుల్లో,  1*4,*6)
మొయిన్ ఆలీ 55 (43 బంతుల్లో,  6*4,*6)
క్రిస్ వోక్స్ 5 (4 బంతుల్లో,  1*4,*6)
ప్లంకెట్ 26 (17 బంతుల్లో,  5*4,*6)
విల్లీ

5 (4 బంతుల్లో,  0*4,*6)

 

Leave a Reply