నెటిజన్లు బీఅలెర్ట్ ..నో ఆర్మీ ఫొటోస్ ప్లీజ్

Posted October 1, 2016

indian army request netizensనెటిజెన్లకి ఆర్మీ చేస్తున్న విన్నపమిది.వాట్స్ అప్ ,ఫేస్ బుక్ ,ఇతర సోషల్ మీడియాలో చురుగ్గా వుండేవారందరికీ అప్రమత్తంగా ఉండాల్సిన తరుణమిది.ఎందుకంటే సరిహద్దుల్లో యుద్ధమేఘాలు కమ్ముకున్న ఈ సమయంలో దేశమంతటా మిలిటరీ విభాగం కదలికలు పెరిగాయి.ఆర్మీ వాహనాలు,ట్యాంకులు,క్షిపణులు …ఇలా యుద్ధ సామగ్రి ఒకచోటు నుంచి మరోచోటుకి తరిలిపోతోంది.ఈ టైం లో కొందరు ఔత్సాహికులు ఆ కదలికల్ని ఫోటోలు తీసి..తాము ఎక్కడ ఫోటో తీశామో చెప్తూ …సోషల్ మీడియా లో పోస్ట్ చేస్తున్నారు.దీనివల్ల ఆర్మీ కదలికల్ని శత్రువులు అర్ధం చేసుకోడానికి వీలు కలుగుతోంది.ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని నెటిజన్లంతా అలెర్ట్ గా ఉండి అలాంటి ఫోటోలు ,పోస్టులకి దూరంగా వుండాలని ఆర్మీ కోరుతోంది.ఆర్మీ తరపున తెలుగు బులెట్ కూడా అర్థిస్తోంది.సాధ్యమైనంత వరకు ఈ విషయం ఎక్కువ మందికి చేరేందుకు నెటిజన్లు చొరవ తీసుకోవాలని కోరుతున్నాం

SHARE