యుకే గ్లోబల్ టీచర్ రేసులో భారతీయ మహిళ

Posted December 14, 2016

indian lady in us global teacher raceindian lady in us global teacher raceగ్లోబల్‌ టీచర్‌ ప్రైజ్‌ రేసులో భారతదేశానికి చెందిన కవితా సంఘ్వీ అనే ఉపాధ్యాయురాలు ముందంజలో ఉంది.ఆమె ముంబయిలోని మెట్‌ రిషికుల్‌ విద్యాలయలో ప్రిన్సిపల్‌, ఫిజిక్స్‌ టీచర్‌గా పనిచేస్తున్నారు. యూకెలో గ్లోబల్‌ టీచర్‌ ప్రైజ్‌ను ప్రతి సంవత్సరం ఏర్పాటు చేస్తారు. ప్రపంచవ్యాప్తంగా విద్యారంగంలో విశేష కృషి చేస్తున్న వారు ఈ బహుమతికి పోటీ పడతారు. ఫిజిక్స్‌ బోధనలో కొత్త పద్ధతిని సృష్టించి ఆమె ఈ పోటీలో నిలిచారు. గ్లోబల్‌ టీచర్స్‌ టాప్‌ 50 జాబితాలో సంఘ్వీ అంటున్నారు. టెక్ట్స్‌బుక్‌ కాన్సెప్ట్‌ను నిజజీవిత పరిస్థితులకు ఎలా అన్వయించుకోవాలనే దానిపై ఆమె విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారు. యూకేలో భారత సంతతి వ్యాపారవేత్త సన్నీ వార్కీ తాను నెలకొల్పిన వార్కీ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఈ గ్లోబల్‌ టీచర్‌ ప్రైజ్‌ను ఏర్పాటు చేశారు.

సమాజంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంత కీలకమైనదో చెప్పడం కోసమే ఈ అవార్డు ను ఏర్పాటు చేశారు 179 దేశాల నుంచి దాదాపు 20వేల నామినేషన్లు రాగా వాటి నుంచి 50 మంది జాబితాను తయారు చేశారు. ఫిబ్రవరిలో 50 మంది నుంచి చివరికి పది మందిని ఫైనల్స్‌కి ఎంపిక చేస్తారు. మార్చి 19, దుబాయ్‌లో జరిగే వార్షిక గ్లోబల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ స్కిల్స్‌ ఫోరమ్‌లో విజేతను ఎంపిక చేసి విజేతకు పది లక్షల డాలర్లు బహుమతిగా ఇస్తారు..ఈ రేసు లో భారతీయ మహిళా ముందంజ లో వుండటం చుస్తే దేశం లో విద్య ప్రమాణాలు మెరుగు పడినట్టే చెప్పాలి.

SHARE