భారతీయ ఓట్లే హిల్లరీకి రక్ష..

 Posted November 8, 2016
indian people votes to hillary can save herఅమెరికా అధ్యక్ష ఎన్నికలంటే దేశంలో మారుమూల పల్లెలుకూడా ఆసక్తిని కనబరుస్తున్నారు.. గతంలో కంటే ఎక్కువ మంది మనవాళ్లు అక్కడ ఉండటంతో ఎమెషల్‌ బంధం ఏర్పడింది.. అందుకే ఎక్కడ చూసినా హిల్లరి.. ట్రంప్‌ల గురించే చర్చిస్తున్నారు. అదే తరహాలో అధ్యక్ష అభ్యర్థులు సైతం భారతీయుల ప్రస్తావన లేకుండా ప్రసంగాలు చేయని పరిస్థితి.. అదేంటి వాళ్లు మనగురించి ఆసకి ్త ఏంటనుకుంటున్నారా.. దాని వెనుక పెద్ద వ్యూహమే ఉంది..
indian people votes to hillary can save her రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి డోనాల్డ్‌ ట్రంప్‌ నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూనే ఎన్నికలపై మరింత ఆసక్తిని కలిగిస్తున్నాడు… ఆ క్రమంలోనే తాను అధ్యక్షుడినైతే జపాన్‌, దక్షిణ కొరియాల నుంచి తమ సేనలను ఉపసంహరిస్తామని చెప్పి మిత్ర దేశాలను సైతం కంగారుపుట్టిస్తున్నాడు. కాని ఈ అంశంపై చైనాకు అనుకూలంగానూ ఉండటంతో అక్కడి ప్రజలకు ట్రంప్‌ తెగనచ్చేశాడు.. మరోవైపు డొమక్రటిక్‌ పార్టీ అభ్యర్థి హిల్లరీ విదేశాంగ మంత్రిగా ఊంటూ చైనాని చక్రబంధనంలో ఉంచేందుకు వ్యూహాలు అమలు చేశారు.. ఈ పరిణామక్రమాలను పరిశీలించిన అమెరికాలో ఉన్న చైనీయులు తమ మద్దతు రిపబ్లికన్‌ పార్టీకే అంటూ కుండబద్దల కొట్టేశారు. ఒక వైపు అమెరికన్లు హిల్లరీ, ట్రంప్‌లకు సమాన మద్దతు తెలపడంతో అక్కడ వత్యాసం ఒకశాతమే ఉంటుంది.. దాని వల్ల నిర్ణయాత్మక ఓట్లు కోసం కచ్చితంగా తమ దేశంలో సెటిలైన విదేశీయులపై ఆధారపడాల్సి వచ్చింది.. ఈ క్రమంలో ఎక్కువ మంది విదేశీయుల జాబితాలో తొలి స్థానం చైనాది అయితే రెండో స్థానం భారత్‌దే.. అందుకే రెండు పార్టీల అభ్యర్థులు పూర్తిస్థాయిలో దృష్టిసారించారు.

indian people votes to hillary can save her

ట్రంప్‌కు చైనీయుల నుంచి 80 శాతంపైగా మద్దతు పొందగలిగితే.. భారతీయుల నుంచి మాత్రం కేవలం 22 శాతమే అభిమానం చూరగొన్నారు. 62 శాతం ఆయన వదే ్ద వద్దంటూ సర్వేలో తేల్చి చెప్పారు.. దీంతో ఆయా ఓట్లను తమ ఖాతాలో వేసుకునేందుకు.. చైనీయుల నుంచి లేని మద్దతును భారతీయుల నుంచి పొందేందుకు హిల్లరీ తవ్రంగా ప్రయత్నిస్తున్నారు. దాని కోసమే ప్రచారంలో మనవారిపై ఎనలేని అభిమానాన్ని చూపిస్తున్నారు. హిల్లరీ అవకాశాలను దెబ్బకొట్టేందుకు ట్రంప్‌ సైతం హిందూ దేవాలయాలకు వెళ్లడం.. హిందువులంటే అభిమానం అంటూ మన వారి అభిమానం పొందడానికి ప్రయత్నిస్తున్నారు.. అలా వారి వ్యూహాల కోసం భారతీయ ఓట్లపై దృష్టిసారింస్తున్నారు.

SHARE