Posted [relativedate]
తెలంగాణ లో ని దేవాలయాల్లో పాత నోట్లు తీసుకోవాలని, ఆ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆదేశాలిచ్చారట నోట్ల రద్దు నిర్ణయంతో దేవాలయాల్లో కూడా భక్తులు సమర్పించే పాత నోట్లను స్వీకరించడం లేదు. దేశంలోని చాలా దేవాలయాల్లో ఇదే పరిస్థితి. పూజ టికెట్లు, ప్రసాదాల కౌంటర్లలో పాత నోట్లను తీసుకోకపోవడంతో దేవాలయాల ఆదాయంపై కూడా ఈ నోట్ల రద్దు ఎఫెక్ట్ పడింది. అయితే తెలంగాణ దేవాదాయ శాఖ చేసిన తాజా ప్రకటన రాష్ట్రంలోని దేవాలయాలకు వెళుతున్న భక్తులకు ఈ పరిస్థితి నుంచి విముక్తి కల్పించింది.
కార్తీక మాసం కావడంతో భక్తులు పెద్ద ఎత్తున దేవాలయాలకు వెళ్లి పూజలు నిర్వహిస్తున్నారు. ఇలాంటి సమయంలో వారిని ఇబ్బంది పెట్టకూడదనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారట . ప్రముఖ దేవాలయాల్లో పాత నోట్లు స్వీకరించకపోవడంపై పలు ఫిర్యాదులు అందిన నేపథ్యంలో దేవాదాయ శాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.