ఇంకొక్కడు మూవీ రివ్యూ..

0
679

 inkokkadu movie review

చిత్రం : ఇంకొక్కడు (2016)
 నటీనటులు : విక్రమ్, నయనతార, నిత్యామీనన్
సంగీతం : హారిస్ జయరాజ్
దర్శకత్వం : ఆనంద్ శంకర్
నిర్మాత : శింబు తమీన్స్
రిలీజ్ డేట్ : సెప్టెంబర్ 8, 2016.

అద్భుతంగా నటించే నటులు చాలా అరుదు. వీరిలో చినాయ్ విక్రమ్ ఒకరు. విక్రమ్ నటిస్తాడు.. అనడం కంటే పాత్రలో జీవిస్తాననడం కరెక్ట్. జయాపజయాల్ని పక్కన పెడితే… ఏదో ఓ కోణంలో కొత్తదనం చూపించడానికి ప్రయత్నిస్తుంటాడు. శివపుత్రుడు, అపరిచితుడు, నాన్న, ఐ వంటి విలక్షణమైన చిత్రాలతో తెలుగు
ప్రేక్షకుల హృదయాల్లో తనదైన స్థానాన్ని ఏర్పరుచుకున్న హీరో చియాన్ విక్రమ్. అయితే, ‘అపరిచితుడు’ తర్వాత విక్రమ్ కి ఆ రేంజ్ ఆ రేంజ్ హిట్ పడలేదు. అయినా.. విక్రమ్ సినిమా వస్తుందంటే.. ప్రత్యేకమైన ఆసక్తి చూపిస్తారు. విక్రమ్ తాజా చిత్రమ్ ‘ఇంక్కొక్కడు’ పై కూడా భారీ ఆశలూ, అంచనాలే నెలకొన్నాయి. మరీ.. ఈసారైన విక్రమ్ హిట్ కొట్టాడా.. ? ఇంతకీ ‘ఇంక్కొక్కడు’ కథేంటో తెలుసుకునేందుకు రివ్యూలోనికి వెళదాం పదండీ..

కథ :
లవ్ (విక్రమ్) కెమికల్ సైంటిస్ట్. ఇతను ‘స్పీడ్‌’ పేర గల డ్రగ్ ని తయారు చేస్తాడు. ఇన్‌హేల‌ర్‌‌ రూపంలో ఉండే ఆ మందు పీలిస్తే… క్షణాల్లో ఓ వ్యక్తి పది రెట్ల బలవంతుడవుతాడు. అయితే ఆ ప్రభావం 5 నిమిషాలే ఉంటుంది. మలేసియాలో భారత దౌత్య కార్యాలయంపై దాడి జరుగుతుంది. ఎనభై ఏళ్ల ముసలాడు అక్కడివాళ్లందరినీ చితగ్గొట్టి కొంతమందిని చంపేస్తాడు. సీసీ కెమెరాల్లో చూస్తే ఆ వృద్ధుడు ఓ ఉత్ప్రేరకం ప్రభావంతో అంత శక్తివంతుడయ్యాడన్న విషయం అర్థమవుతుంది. ఉత్ప్రేరకమే లవ్ తయారు చేసిన ‘స్పీడ్‌’ డ్రగ్. ఈ స్పీడ్‌ అరాచక శక్తుల చేతుల్లోకెళితే చాలా ప్రమాదం. అందుకే ఈ కేసుని ఛేదించడానికి ఇండియా నుంచి అఖిల్‌ (విక్రమ్‌), ఆరుషి (నిత్యామీనన్)తో కలిసి మలేషియాకి వెళ్తారు. వీరిదరు రా ఏజెంట్లు. నాలుగేళ్ల క్రితం మలేసియాలోనే తన భార్య (నయనతార)ని కోల్పోతాడు అఖిల్‌. దానికీ, ఇప్పుడు స్పీడ్‌ ఉపద్రవానికీ కారణం.. ఒక్కడే. తనే లవ్‌ (విక్రమ్‌). అఖిల్‌ భార్య ఎలా చనిపోయింది?
మలేసియా వెళ్లిన అఖిల్‌ లవ్ ని అంత మొందించాడా.. ? అనేది మిగితా కథ.

ప్లస్ పాయింట్స్ :
* విక్రమ్
* సినిమాటోగ్రఫీ
* విజువల్ ఎఫెక్ట్స్
* బ్యాక్ గ్రౌండ్ స్కోర్

మైనస్ పాయింట్స్ :
* ముందే ఊహించే కథ-కథనాలు
* పాటలు
* కామెడి
* సినిమా నివిడి

నటీనటుల పర్ ఫామెన్స్ :
ఎప్పటిలాగే విక్రమ్ ఇరగదీశాడు. మరోసారి తనలోని నటుణ్ని అద్భుతంగా తెర మీద ఆవిష్కరించాడు. సిన్సియర్ రా ఆఫీసర్ గా కనిపిస్తూనే గే లక్షణాలున్న
క్రూయల్ సైంటిస్ట్, లవ్ పాత్రలోనూ ఆకట్టుకున్నాడు.  అఖిల్‌, లవ్‌ రెండు పాత్రల్లోనూ వైవిధ్యం చూపించాడు. అయితే, లవ్‌ పాత్రలో విక్రమ్‌ గెటప్‌, బాడీ లాంగ్వేజ్‌ బాగున్నాయి. దర్శకుడు ఆనంద్ చాలా చోట్లా ఫేలయ్యాడు. ‘స్వీడ్’ డ్రగ్ వల్ల కలిగే అనర్థాలని బాగా చూపించలేకపోయాడు. దాంతో.. తెరపై హీరో చేసే విన్యాసాలకు ప్రేక్షకుడు సరిగ్గా కనెక్ట్‌ అవ్వలేకపోయాడు. విక్రమ్, నయనతార, నిత్యామీనన్ నటీనటులని పెట్టుకొన్న దర్శకుడు అందుకు తగ్గ స్థాయిలో కథా కథనాలను రెడీ చేసుకోవడంలో ఫేలయ్యాడు. అయితే, హీరో విక్రమ్ తో తొలిసారిగా పూర్తి స్థాయి విలన్ రోల్ చేయించి ఆకట్టుకొన్నాడు. నయన్ గ్లామర్ షో సినిమాకు మరింత ప్లస్ అయ్యింది. నిత్యమేనన్‌ పాత్రకి నటించే స్కోప్ లేదు. ఆమె పాత్రని సరిగ్గా వాడుకోలేదు. ఇక, మిగితా నటీనటుల పాత్రలు పెద్దగా రిజిస్టర్ కావు.

సాంకేతికంగా :
హారిస్ జయరాజ్ అంచిన సంగీతం ఆశించిన స్థాయిలో లేదు. అయితే పాటలతో నిరాశపరిచిన హారిస్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో అలరించాడు. కీలక సన్నివేశాల్లో నేపథ్య సంగీతం ఆకట్టుకుంటుంది. సినిమాటోగ్రఫీ ఎక్సలెంట్. ప్రతి ఫ్రేమ్ ను రిచ్ గా చూపించడంలో సినిమాటోగ్రఫర్ విజయవంతం అయ్యాడు. ఎడిటింగ్ పరావాలేదు. పాటలు సందర్భానుచితంగా లేవు. ఈ సినిమాకి కమెడి పెద్ద మైనస్.

తెలుగు బుల్లెట్ అనాలసిస్:
విక్రమ్ నటని అమితంగా ఇష్టపడేవారు.. ‘స్పై థ్రిల్లర్స్’ను ఇష్టపడే వారికి ఇంకొంక్కడు బాగా నచ్చేస్తాడు. విక్రమ్ నటన కోసమైనా ఓ సారి చూసెయొచ్చు.

బాటమ్ లైన్ : ఇంకొక్కడు.ప్రయోగం లో పసలేదు

Leave a Reply