బుల్లి తెరపై కొంత కాలం తెగ సందడి చేసిన రవి, లాస్యలు కొన్ని కారణాల వల్ల విడిపోయారు. వీరిద్దరు విడిపోయిన తర్వాత వచ్చిన వార్తలు ఏ స్థాయిలో వచ్చాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రవికి పెళ్లి అయినా కూడా లాస్యను ప్రేమించాడు అని, పెళ్లి చేసుకుందాం అంటూ ఒత్తిడి చేశాడు. అందుకే లాస్య అతడికి దూరంగా జరిగింది, వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. రవి వల్ల బుల్లి తెరకు పూర్తిగా లాస్య దూరం అయ్యింది అంటూ వార్తలు వచ్చాయి. తాజాగా లాస్య హీరోయిన్ ‘రాజా నువ్వు కేక’ అనే చిత్రంలో నటించింది. ఆ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమం కోసం లాస్య కాస్త గ్యాప్ తర్వాత మీడియా ముందుకు వచ్చింది.
లాస్య సినిమా గురించి మాట్లాడటంతో పాటు మరోసారి తన బుల్లి తెర ప్రస్థానం, తన కో యాంకర్ రవి గురించి మాట్లాడటం జరిగింది. అతడితో నేను కంఫర్ట్‌బుల్‌గా వర్క్ చేయలేక పోయాను. అందుకే అతడి నుండి దూరం జరిగాను. అంతే తప్ప బుల్లి తెర నుండి పూర్తిగా తాను దూరం కాలేదు అంటూ చెప్పుకొచ్చింది. మంచి అవకాశం వస్తే తప్పకుండా యాంకర్‌గా చేస్తాను అని, మంచి పార్టనర్ లభిస్తే తప్పకుండా మళ్లీ కొత్త వ్యక్తితో జత కట్టి యాంకరింగ్ చేసేందుకు తనకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం రవి సందడి బుల్లి తెరపై మామూలుగా లేదు. ఈ సమయంలో లాస్య మళ్లీ బుల్లి తెర ఎంట్రీ ఇవ్వడం దాదాపు అసాధ్యం అంటున్నారు. లాస్యకు మళ్లీ బుల్లి తెరపై స్ధానం దక్కుతుందా, ఆమె ఏ యాంకర్‌తో జత కడుతుందో చూడాలి.