బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ చనిపోయాడు అంటూ అంతర్జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. యూరప్‌కు చెందిన ఒక మీడియా సంస్థలో ఈ వార్త రావడంతో ఇప్పుడు అంతా కూడా హైరానా పడిపోతున్నారు. అసలు షారుఖ్ ఖాన్ ఎక్కడ ఉన్నాడు, ఆయనకు ఏమైంది అంటూ ఆందోళనలో అభిమానులున్నాయి. ఆయన గురించి సినీ ప్రముఖులు కూడా ఎంక్వౌరీ చేసే ప్రయత్నంలో ఉన్నారు.
ఇటీవలే వ్యాపార రీత్య అమెరికా వెళ్లిన షారుఖ్ ఖాన్ అక్కడ ఒక ఎయిర్ క్రాప్ట్‌లో ఒక ప్రదేశం నుండి మరో ప్రదేశంకు వెళ్తున్నాడు. ఆ సమయంలోనే ఎయిర్‌క్రాప్ట్ క్రాష్ ల్యాండ్ అయ్యిందని, దాంతో షారుఖ్‌తో పాటు అందులో ప్రయాణిస్తున్న దాదాపు 12 మంది మృతి చెందినట్లుగా అక్కడ స్థానిక మీడియాలో వార్తలు వచ్చినట్లుగా చెబుతున్నారు. అయితే ఈ విషయాన్ని ఇంకా అధికారికంగా ఆయన కుటుంబ సభ్యులు నిర్థారించడం కాని, కొట్టి పారేయడం కాని చేయలేదు. దాంతో ఇప్పుడు బాలీవుడ్ నుండి అంతా కూడా ఆందోళనలో మునిగి పోయారు. వెంటనే షారుఖ్ ఖాన్ సంబంధీకులు స్పందించాలని అంతా కోరుకుంటున్నారు.