నేడు అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం

Posted February 21, 2017

International mother language day

భాష అంటే జనం.
ఏ భాష అయినా నాగరికత,
వైజ్ఞానిక ప్రగతితోపాటు తాను కూడా ఒక ఆధునిక రూపాన్ని, జీవాన్ని సంతరించుకుంటూనే ఉంటుంది.
మనిషికి భాష ప్రాణంతో సమానం.
మతం మార్చుకోవచ్చు, రాజకీయాలు మార్చుకోవచ్చు, వేషధారణ మార్చుకోవచ్చు, ఏదన్నా చెయ్యొచ్చు,
కానీ…..
మాతృభాషను మార్చుకోలేరు’’

ఈ వాక్యాలు వినగానే మాతృభాషాభిమానులందరూ పరవశిస్తారు.
ఏ ఒక్క భాష నూటికి నూరుపాళ్లు స్వచ్ఛమైనది
తెలుగు కీర్తికి పెట్టని కోట మన భాష…
తెలుగు బాష.
తల్లిపాల మాధుర్యాన్ని తలపించేదే అమ్మ భాష.
ప్రతి రాష్ట్రానికి ఆ రాష్ట్ర మాతృభాషే అధికార భాషగా ఉండాలనీ, పరిపాలన వ్యవహారాలన్నీ మాతృభాషలోనే జరగాలని, మన తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ ఆంధ్రప్రదేశ్ అవతరణ సందర్భంగా చెప్పారు.
కానీ….
ఆంధ్రప్రదేశ్ ఆంగ్లప్రదేశ్‌గా మారుతున్నదే తప్ప తెలుగు వాడకం పెరగడం లేదు.
ఇప్పుడు తెలుగువారి ఇళ్లలోనే తెలుగుకు సరైన మన్నన దక్కడం లేదు. ఈ దుర్గతిని పోగొట్టాలంటే తెలుగును ఆధునిక ప్రయోజనాలు, పరిపూర్ణంగా సాధించగల సమర్ధమైన భాషగా మార్చాలి.
మన ఆలోచనలో మార్పురావాలి.
తెలుగు చదివితేనే తన బిడ్డకు అన్నం దొరుకుతుందని ప్రతి తల్లి అనుకునే రోజు రావాలి.
అందుకే నేటి నుండి మనం తెలుగులోనే రాస్తామని,
మాట్లాడతామని ప్రతినబూనుదాం.
తెలుగు భాషను ప్రపంచ భాషల సరసన నిలబెట్టుదాం.

                                                                                                                                  -రాజేష్.ఏచూరి

SHARE