షర్మిలకు చేదు అనుభవం ..

  irom sharmila sad experience home purpose
జనం కోసం నేను తప్పు చేసిన వాళ్ళను శిక్షిస్తుంటే ..నన్ను చూసి కూడా జనం భయపడుతున్నారేంటమ్మా …సింహా సినిమాలో బాలకృష్ణ డైలాగ్ ఇది ..ఆ సన్నివేశం బాగా పండింది.ఇప్పుడు మన కళ్ళ ముందు కూడా అలాంటి అనుభవమే ఎదురవుతోంది 16 ఏళ్ళ పాటు దీక్ష సాగించిన షర్మిలకు .. మణిపూర్ వాసుల ప్రాణాల కోసం తన ప్రాణాన్ని పణంగా పెట్టి సాయుధబలగాలకి ప్రత్యేక అధికారానికి వ్యతిరేకంగా పోరాడారు.

దీక్ష విరమించిన ఆమె ఇంటికోసం ఇంఫాల్ లోని ఓ ప్రాంతాన్ని ఎంచుకున్నారు.అయితే ఆమె ఇక్కడ ఉండేందుకు వీల్లేదని స్థానికులు అడ్డం తిరగడంతో షర్మిల మనస్తాపం చెందారు ..అక్కడనుంచి దీక్ష జరిపిన చోటుకి వచ్చారు .విషయం తెలిసిన మణిపూర్ చాప్టర్ అఫ్ రెడ్ క్రాస్ సొసైటీ షర్మిలకు నివాస ఏర్పాట్లు చేయడానికి ముందుకొచ్చింది.నిన్నమొన్నటి దాకా సేవ్ షర్మిల పేరిట ఓ గ్రూప్ నడిపినవారు కూడా మొహం చాటేశారు ..ఇదంతా చూసిన,చూస్తున్న వాళ్లకి గాయం సినిమాలో సీతారామశాస్త్రి రాసిన ఓ పాట గుర్తొస్తోంది …అదే …నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని ….మారదు లోకం …మారదు కాలం..

SHARE