ఉక్కు మ‌హిళకు చిత్తు ఓట‌మి!!!

0
301
irome shermila lost in elections

Posted [relativedate]

irome shermila lost in elections
మ‌ణిపూర్ లో సాయుధ ద‌ళాల ప్ర‌త్యేక అధికారాల చ‌ట్టం ర‌ద్దు కోసం అస‌మాన పోరు చేసిన ఉక్కు మ‌హిళ ఇరోం ష‌ర్మిల‌. త‌న ప్రాణాల‌ను సైతం పణంగా పెట్టి 16 ఏళ్ల పాటు నిరాహార‌దీక్ష చేసిన పోరాట యోధురాలు ఈ వ‌నిత‌. అలాంటి ఐరన్ లేడీ పాలిటిక్స్ లోకి వ‌స్తే…!! అది కూడా మణిపూర్ లాంటి బ‌ల‌మైన నాయ‌క‌త్వం లేని రాష్ట్రంలో ఆమె ఎంట్రీ ఇస్తే..!! ఎవ‌రైనా ఏమ‌నుకుంటారు? ఢిల్లీలో అర‌వింద్ కేజ్రీవాల్ లా మ‌ణిపూర్ ను ఊడ్చిపారేస్తార‌ని ఆశిస్తారు. కానీ మ‌ణిపూర్ లో మాత్రం అలా జ‌ర‌గ‌లేదు. చివ‌ర‌కు ఆమె సైతం ఘోరంగా ఓడిపోవాల్సి వ‌చ్చింది.

ఇటీవ‌లే పీఆర్జేఏ పేరుతో పార్టీని పెట్టారు ఇరోం ష‌ర్మిల‌. ఆ పార్టీ త‌ర‌పునే ఎన్నిక‌ల బ‌రిలోకి దిగారు. పాలిటిక్స్ లోకి వ‌చ్చారు కానీ రాజ‌కీయాల‌కు కావాల్సిన ప‌రిణ‌తి ఆమె క‌నిపించ‌లేదు. త‌న పార్టీకి జ‌నంలో త‌గిన మ‌ద్ద‌తును కూడ‌బెట్ట‌లేక‌పోయారు. మీడియాను మ్యానేజ్ చేయ‌లేకపోయారు. ప్ర‌జ‌ల‌కు మంచి పాల‌న అందిస్తాన‌న్న భ‌రోసాను క‌ల్పించ‌లేక‌పోయారు. చివ‌ర‌కు త‌న పార్టీ త‌ర‌పున అన్ని స్థానాల నుంచి అభ్య‌ర్థుల‌ను నిల‌బెట్ట‌డంలోనూ విఫ‌ల‌మ‌య్యారు. దీంతో ఎన్నిక‌ల‌కు ముందే ఆ పార్టీ ప్ర‌భావం పెద్ద‌గా ఉండ‌ద‌ని తేలిపోయింది.

అయితే ఎన్నిక‌ల్లో ఇరోం ష‌ర్మిల త‌న‌దైన ప్ర‌భావం చూపిస్తార‌ని అంద‌రూ ఆశించారు. గ‌ట్టి పోటీ అయినా ఇస్తార‌ని భావించినా అలా జ‌ర‌గ‌లేదు. సీఎం ఇబోబిసింగ్ చేతిలో దారుణ ప‌రాజ‌యాన్ని మూట‌గ‌ట్టుకున్నారు. షర్మిల‌కు కేవ‌లం 100 లోపు ఓట్లు రావ‌డం ఆశ్చ‌ర్య‌క‌రం. నోటా ఓట్ల కంటే ఆమెకు వ‌చ్చిన ఓట్లు త‌క్కువ‌. 16 ఏళ్ల పాటు పోరాడిన యోధురాలికి ఈ స్థాయిలో అవ‌మాన‌క‌ర ఓట‌మి ఎదురుకావ‌డం చాలామంది జీర్ణించుకోలేని విష‌యం.

మ‌ణిపూర్ లో వెల్ల‌డైన ఫ‌లితాల‌ను బ‌ట్టి చూస్తే.. ఇప్పటి ఓటర్ల‌కు కావాల్సింది అభ్య‌ర్థి చ‌రిత్ర కాదు. ఆ అభ్య‌ర్థికి ఫ్యూచ‌ర్ లో త‌మ‌కు ఏమైనా చేయ‌గ‌ల స‌త్తా ఉందా లేదా అని ఆలోచిస్తున్నారు. మృదుస్వభావిగా ఉన్న ష‌ర్మిల‌కు అంత స్థాయి లేద‌ని మ‌ణిపూర్ జ‌నం భావించారు. అందుకే ఆమెను తిర‌స్క‌రించారు. అందుకే ఆమె పాలిటిక్స్ నుంచి రిటైర్ మెంట్ ప్ర‌క‌టించారు. అయితే జ‌నం తీర్పు ఎలా ఉన్నా… ఒక పోరాట‌యోధురాలు రాజ‌కీయాల నుంచి ఇంత అవ‌మాన‌క‌రంగా వెళ్ల‌డం చింతించాల్సిన విష‌యం!!!

Leave a Reply